Beechupalli Krishna River
Mahalaya Amavasya : మహాలయ అమవాస్య పర్వదినాన్ని పురష్కరించుకొని ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి క్షేత్రానికి భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే విచ్చేసిన భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించిన అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ అమవాస్యకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా పుష్కరఘాట్‌లో గతించిన పెద్దలకు పిండప్రదానాలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగాఈ రోజు బీచుపల్లి క్షేత్రానికి భక్తులు తరలి వచ్చారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.