×
Ad

Chinnamasta Devi : రాజమౌళి ‘వారణాసి’ సినిమాలో ఛిన్నమస్తా దేవి రూపం.. ఇంతకీ ఆమె ఎవరు..? తల నరికేసుకొని రక్తధారలతో నగ్నంగా ఎందుకు ఉంటుంది..?

ఛిన్న మస్తాదేవి రూపం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు దాగిఉన్నాయి. నారద పంచరాత్రం పురాణంలో ఛిన్న మస్తాదేవి జన్మవృత్తాతం సవివరంగా ఉంది.

Chinnamasta Devi

Chinnamasta Devi : : రాజమౌళి – మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గ్లింప్స్ లో సముద్ర గర్భంలో ఛిన్నమస్తాదేవి రూపం కనిపిస్తోంది. తన మొండెం నుంచి మూడు రక్తధారలు ప్రవహిస్తుంటాయి. రెండు రక్తధారలు ఆమె సహయోగినులైన డాకినీ, వార్షిణి నోట్లోకి వెళ్లగా.. మరో రక్తధారను ఆమె సేవిస్తుంది. ఆమె భయానక రూపంలో ఉన్నా.. లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతిభింభిస్తుంది. అయితే, ఛిన్న మస్తాదేవి భయానక రూపం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి.

ఛిన్న మస్తాదేవి రూపం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు దాగిఉన్నాయి. నారద పంచరాత్రం పురాణంలో ఛిన్న మస్తాదేవి జన్మవృత్తాతం సవివరంగా ఉంది. ఒకసారి పార్వతీదేవి మందాకినీ నదిలో స్నానం చేస్తుండగా లైంగిక ఉత్తేజం కలిగి దేహం నల్లగా మారింది. ఆ సమయంలోనే ఈమె సేవకురాళ్లు అయిన డాకినీ, వార్ణిణి వచ్చి ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా పెట్టమ్మా అని ఆర్ధిస్తారు. ఈమె అన్నపూర్ణాదేవి కూడా కనుక.. సకలభూతజాలం యొక్క ఆకలి తీర్చే బాధ్యత కలిగిఉన్న కారణంచేత .. ఈమె చుట్టు ప్రక్కల ఎక్కడ వెతికినా తినడానికి ఏమీ దొరకకపోవడంతో వెంటనే తన తలను ఖండించుకుంటుంది. దీంతో మొండెం నుంచి వచ్చే మూడు రుధిరదారల్లో రెండింటిని డాకినీ, వార్షిణి నోటిలోకి ప్రవహించేలా చేస్తుంది.. మూడో ధారను తానే ఆస్వాధిస్తుంది. తద్వారా వారి ఆకలి తీరుస్తుంది. ఛిన్నమస్తాదేవి ఉపాసన వల్ల ఆత్మజ్ఞానం, మానసిక బంధనాల నుంచి విముక్తి, శత్రుపీడల నుంచి రక్షణ కలుగుతాయని నమ్ముతారు.

ఇంకో కథ ప్రకారం.. ఈమె లైంగిక ఉత్తేజం వల్ల స్వీయ నియంత్రణ కోసం రతీమన్మథుల దేహాలపై నగ్నంగా నిలబడి.. మనస్సుమీద ఆధిపత్యం కోసం భౌతిక దేహంపై పూర్తి నియంత్రణ కలిగించి దాని నుంచి మనస్సును వేరు చేసి విముక్తి చేయడానికి స్వీయ ఛిరఛ్చేధం చేసుకుంటుంది. తద్వారా ఈమె లైంగిక స్వీయ నియంత్రణ సాధిస్తుంది. తాంత్రిక పూజలు, ఉపాసనలు, దీక్షలు చేసేవారికి స్వీయనియంత్రణ అవసరం కనుక.. ఈమెను తమ ఆరాధనల్లో భాగంగ చేసుకున్నారు.

అయితే, ఛిన్నమస్తా దేవిని మానవుని జీవన విధానంలో భాగమైన జన్మ, రతి, మృత్యువు మూడు ముఖ్యదశల్లో మూడు రూపాంతరాలుగా సేవిస్తారు. గృహస్తులు, గృహిణిలు, సంసార బాధ్యతలు ఉన్నవారు ఈమెను ఇంట్లో సాత్విక దేవతలతో పాటు ఆరాధన చేయలేరు. ఈమె ఆరాధన బహుసంక్లిష్టమైన ప్రక్రియ. కేవలం గట్టి నియంత్రణ కలిగిన ఉపాసకులు సిద్ధి, స్వీయ నియంత్రణ కొరకు ఆమెను ఆరాధన చేస్తారు. ఛిన్న మస్తాదేవి తాంత్రిక సాధనలో అత్యంత ముఖ్యమైన దేవతగా భావిస్తారు. ఆమె సర్వశక్తి ప్రదాత్రి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే శక్తిరూపిణి అంటారు.

‘ఛిన్న’ అంటే తొలగించిన లేదా ఖండించిన అని అర్ధం, ‘మస్తా’ అంటే శిరస్సు అని అర్ధం. ఛిన్న మస్తాదేవి, దశ మహా విద్యల్లో ఒక విశిష్టమైన దేవతగానూ భావించబడతారు. ఆమెను వజ్ర వైరోచనీ, ప్రచండ చండీ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్ లో చింతపుర్ణీ దేవిగా ఆమె ప్రసిద్ధిగాంచారు.