వినాయకచవితి : గణనాథుడిని పూజిస్తే.. అన్నీ విజయాలే

  • Publish Date - August 26, 2019 / 09:37 AM IST

వినాయకుడు, విఘ్నేశుడు, గణేషుడు, ఏకదంతుడు, లంబోదరుడు ఇలా పేరు ఏదైనా గణాలకు నాయకుడు వినాయకుడే. ఏ పూజ అయినా..ఏవ్రతమైనా..ఏ కార్యక్రమమైన వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే విఘ్నాలను అంటే ఆటంకాలన్నింటినీ తొలగించి.. విజయాలను చేకూర్చే గణనాథుడు కాబట్టి. అంతేకాదు వినాయకుడు పవిత్రకు మారుపేరుగా భాసిల్లుతున్నాడు. వినాయక చవితి పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు (చందమామ వృద్ధిచెందే 4వ రోజు) వస్తుంది. 2019లో సెప్టెంబర్ నెల 2వ తేదీన ఈ వినాయకచవితి వచ్చింది.

వినాయకుడు పూజ చేసిన ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది విజయాన్ని సిద్ధంపజేస్తుంది.  ప్రారంభంలో వినాయకుని పూజించడం ఆనవాయితీ, సంప్రదాయం. వినాయకుడి పూజ చేసి పని మొదలు పెడితే.. సాక్షాత్తు వినాయకుడే దగ్గర ఉండి తప్పిదాలు జరుగకుండా.. తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సాయం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. 

శివపార్వతుల కుమారుడైన వినాయకుడు.. సంవత్సరంలో ఒకరోజు అతిధిగా వచ్చి నవరాత్రులు మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు. విఘ్నాలు లేకుండా కనిపెట్టుకుని ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. నవ రాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు.. తిరిగి కైలాసగిరికి వెళ్ళిపోతాడు. మనకు మాత్రం సంవత్సం పొడవునా ఆటంకాలు లేకుండా చేస్తాడని భక్తులు నమ్ముతారు.