Srisailam Temple : గుడ్ న్యూస్, సామాన్య భక్తులకు స్పర్శ దర్శనం

దసరా మహోత్సవాల నుంచి సామాన్య భక్తులకు మల్లిఖార్జున స్వామి వారి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది.

Sparsha Darshan : కరోనా ఎఫెక్ట్ ప్రతి రంగంపై పడింది. దేవాలయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. దేవాలయాల దర్శన విషయంలో ఆలయ అధికారులు పలు ఆంక్షలు, నిబంధనలు విధించాల్సి వచ్చింది. కొన్ని రోజులు ఆలయాలు తెరుచుకోలేదు. దర్శన భాగ్యం కల్పించలేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నియమ నిబంధనల మధ్య భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు.

Read More : SCR : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు

తాజాగా..మల్లన్న భక్తులకు శ్రీశైలం దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా మహోత్సవాల నుంచి సామాన్య భక్తులకు మల్లిఖార్జున స్వామి వారి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది. 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం నుంచి భక్తులందరికీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో వారంలో నాలుగు రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు క్యూ లైన్ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించే వారనే సంగతి తెలిసిందే.

Read More : Shivraj Chouhan : రాహుల్ ఉన్నంతకాలం బీజేపీకి ఇబ్బందే లేదు

సామాన్య భక్తులకు కూడా స్పర్శ దర్శన భాగ్యం కల్పించాలనే వినతులు వెల్లువెత్తాయి. దీంతో నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు అవకాశం కల్పించనున్నామని ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. అయితే..ఆలయానికి వచ్చే భక్తులు సంప్రదాయం ప్రకారం రావాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు