Narasimha Jayanthi 2026 : నరసింహ జయంతి నాడు ఈ ఒక్క మంత్రాన్ని చదివితే.. రుణ బాధల నుంచి విముక్తి..!
Narasimha Jayanthi 2026 : నరసింహ జయంతి నాడు ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే.. అప్పలు భారం నుంచి బయటపడతామని పండితులు చెబుతున్నారు.
- Dharani Pilli
- Updated on- April 29, 2026 / 09:07 PM IST
Narasimha Jayanthi 2026 to get rid of all your debts Recite this single mantra
Narasimha Jayanthi 2026 : నరసింహ జయంతికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పుల భారం నుంచి బయటపడాలంటే.. ఒక్క మంత్రాన్ని చదివితే రుణభారం నుంచి విముక్తులవుతారని పండితులు చెబుతున్నారు. హిరణ్యకశిపుని సంహారం గడపపైనే జరిగింది కాబట్టి, ఈ రోజున ఇంటి సింహద్వారానికి (గడపకు) పసుపు, కుంకుమ అద్ది, అక్షతలతో పూజించడం విశేషం. సాయంత్రం 4:17 నుండి 6:56 గంటల మధ్య గడప దగ్గర కూర్చుని ‘లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం’ పారాయణం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని వివరించారు.
రుణ బాధల విముక్తి:
అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ రోజున ‘రుణ విమోచక నరసింహ స్తోత్రం’ లేదా నరసింహ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా ఉపశమనం పొందుతారు.
కుజదోష నివారణ:
ఈ ఏడాది నరసింహ జయంతి చిత్తా నక్షత్రంలో వస్తున్నందున, కుజదోషంతో బాధపడేవారు స్వామివారికి కళ్యాణం లేదా అభిషేకం జరిపించుకోవడం ద్వారా ఆ దోషం నుండి విముక్తి పొందవచ్చు.
ప్రత్యేక సమర్పణలు:
అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి స్వామికి వెండి నాణేలు, కాలసర్ప దోష నివారణకు నెమలి ఈకలు సమర్పించాలని సూచించారు.
నైవేద్యం:
లక్ష్మీ నరసింహ స్వామి చిత్రపటానికి తులసి మాల వేసి, బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి.
శాంత స్వరూపం:
ఇంట్లో పూజించేటప్పుడు ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కలిసి ఉన్న నరసింహ స్వామిని మాత్రమే పూజించాలని, ఉగ్రరూపాన్ని పూజించకూడదని హెచ్చరించారు.
ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, ప్రదోష కాలంలో స్వామిని ఆరాధించడం ద్వారా శత్రు బాధలు, నరఘోష మరియు అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.
