Navaratri 2023 : ఆరోగ్యం..విజయం ప్రసాదించే అనంత శక్తి స్వరూపిణి ‘గాయత్రీ దేవి’

గాయత్రి మంత్రం జపిస్తే సమస్త దేవతలను ప్రార్థించినట్లే అని రుగ్వేదం చెబుతోంది. నవరాత్రుల్లో రెండవరోజు గాయత్రీ దేవిని పూజిస్తే విజయాలు సొంతం అవుతాయి.

Navaratri 2023

Navaratri 2023 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. అన్ని మంత్రాలకు మూలమైన గాయత్రీ దేవిని పూజిస్తే మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

అనంత శక్తి స్వరూపిణి గాయత్రీ దేవి. ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్న వేళ సావిత్రిగా, సంధ్య వేళ సరస్వతిగా అమ్మవారు పూజలందుకుంటుంది. గాయత్రీ దేవి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి దేవిని పూజిస్తే బుద్ధి, తేజస్సు పెరుగుతుంది.

Tirumala : తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 15 నుండి 23 వరకు

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్”
గాయత్రి మంత్రం పఠిస్తే చతుర్వేదాలు పఠించిన ఫలితం దక్కుతుంది. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లుగా రుగ్వేదంలో పేర్కొన్నారు. ఈ మంత్రం జపించడం వల్ల ఆనందంతో పాటు మంచి ఆలోచనలు, ఆత్వవిశ్వాసం పెంపొందుతాయి. నిత్యం గాయత్రి మంత్రం పఠిస్తే విజయాలు సొంతం అవుతాయి. ఈ మంత్రం పఠించినవారి ఆరోగ్యం బాగుంటుంది. ఏకాగ్రత కుదురుతుంది.

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు.. అలంకరణలు.. విశిష్టతలు

ఈరోజున అమ్మవారికి నారింజ రంగు చీరను అలంకరిస్తారు. గాయత్రి స్త్రోత్రాలు, పారాయణ చేస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారు.