Padmavathi Ammavari Karthika Brahmotsavam Fifth Day
Padmavathi Ammavaru : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నులు పండుగగా కొనసాగుతున్నాయి. 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం ఐదో రోజు…పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు, పండితులు. కోవిడ్ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో పలు నిబంధనల మధ్య బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జరిగింది.
Read More : Vegetables for Telangana: ఏడాదికి తెలంగాణకు కావాల్సిన కూరగాయలు
వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసూదన్, ఏవీఎస్వోవెంకటరమణ, టెంపుల్ ఇన్స్ పెక్టర్ రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహక భేదాన్నిగుర్తుంచు కోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోందని పండితులు వెల్లడించారు.
Read More : Corona Cases : దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు..415 మరణాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 2021, నవంబర్ 30వ తేదీ మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో డిసెంబరు 4న రాత్రి గజవాహనం, డిసెంబరు 5న రాత్రి గరుడవాహనం, డిసెంబరు 8న పంచమితీర్థం, డిసెంబరు 9న పుష్పయాగం నిర్వహించనున్నట్లు ఈవో వీరబ్రహ్మం చెప్పారు. అమ్మవారి కరుణతో ప్రపంచ మానవాళి సుభిక్షంగా ఉండాలని, బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని సంకల్పం చేసినట్టు ఆయన వివరించారు.