తమిళనాట పొద్దుపొద్దున్నే పేలిన టపాసులు 

  • Publish Date - October 27, 2019 / 03:46 AM IST

తమిళనాట దీపావళి సంబరాలు సూర్యోదయంతోనే ప్రారంభమయ్యాయి. చెన్నైలో ఉదయాన్నే చిన్నా పెద్దా అందరూ టపాసుల మోత మోగించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సడలించాలని.. ఉదయం కూడా మరో రెండు  గంటలు టపాసులు పేల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది.

తమిళనాడు అభ్యర్ధనపై  కోర్టు తన తీర్పును సడలిస్తూ.. టపాసులు పేల్చడానికి అదనంగా రెండు గంటలు సమయం నిరాకరిస్తూ, రోజు మొత్తంలో ఎప్పుడైనా రెండు గంటల పాటు టపాసులు పేల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అందుకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం దీపావళి రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు టపాసులు కాల్చాలని ఆదేశించింది.  ఆదేశాల్లో భాగంగానే తమిళ తంబీలు  ఉదయం టపాసులను పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.