అయోధ్య రామమందిరం దర్శన సమయాలేంటి? ఎలా చేరుకోవాలి? సందర్శకుల ప్రశ్నలకు సమాధానాలివే!

Ayodhya Ram Mandir Timings : అయోధ్యలో రామ్ లల్లా దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సందర్శకులు ఆరతి, దర్శనం కోసం అయోధ్యకు ఎలా చేరుకోవాలి? ఏయే సయమాల్లో దర్శనానికి అనుమతి ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Ram Mandir Darshan Timings and FAQs answered for visitors

Ayodhya Ram Mandir Timings : అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన కొన్ని రోజుల తర్వాత నగరంలో రామ్ లల్లా దర్శనం కోసం దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దాంతో పొడవైన క్యూలు బారులు తీరుతున్నారు. బాలరాముని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు భారీ క్యూలలో వేచి ఉంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆలయ ట్రస్ట్ ఆరతి, దర్శనానికి సంబంధించిన కొత్తగా అప్‌డేట్ చేసిన షెడ్యూల్‌లను విడుదల చేసింది. భక్తులకు పూజలు చేసే అవకాశం కల్పించేందుకు ఆలయ ట్రస్ట్ దర్శన వేళల్లో కూడా మార్పులు చేసింది. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్‌ వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్తున్నారా? రోడ్డుమార్గంలో ఎలా చేరుకోవాలంటే? రోడ్ ట్రిప్ గైడ్ ఇదిగో..!

అయితే, చాలామందిలో అయోధ్యను ఏయే మార్గాల్లో ఎలా చేరుకోవాలి? ఎన్ని రోజులు అక్కడ ఉండాలి? అనేదానిపై అనేక సందేహాలు ఉంటాయి. అందులో ప్రధానంగా ఆలయ దర్శించే సమయం ఎప్పటినుంచి ప్రారంభవుతుంది.. ఎన్ని గంటల వరకు అనుమతినిస్తారు.. ఏయే సమయాల్లో ఆరతి దర్శనం ఉంటుంది? ఆలయ దర్శన ప్రవేశానికి ఫీజు ఎంత ఉంటుంది? రామమందిరంలోకి ఆరతి దర్శనానికి ఏదైనా పాస్ అవసరమా? ఒకవేళ ఉంటే.. పాస్ ధర ఎంత ఉంటుంది? దర్శన టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ అందుబాటులో ఉందా? ఆలయ ప్రవేశానికి ఎలా అనుమతిస్తారు?  అన్ని (FAQs) ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆలయ దర్శన సమయం ఎప్పటినుంచి ఎప్పటివరకు?
ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు దర్శననానికి అనుమతిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది.

2. ఆలయంలో ఆరతి దర్శనానికి సమయాలేంటి?
రామ్ లల్లా విగ్రహానికి శృంగార్ ఆరతి (ప్రార్థన) ఉదయం 6:30 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భోగీ ఆరతి ఉంటుంది. రాత్రి 7.30 గంటల నుంచి సంధ్య ఆరతి కోసం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

3. రామమందిరంలోకి ప్రవేశానికి ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందా?
రామమందిర దర్శనానికి వచ్చే భక్తులకు సాధారణ ప్రవేశానికి ఎలాంటి ఫీజు లేదు. ఉచిత ప్రవేశానికి అనుమతి ఉంటుంది.

4. ఆలయంలోకి ప్రవేశానికి ఏదైనా పాస్ అవసరమా?
ఆలయ ప్రవేశానికి ముందుగా ఆన్‌లైన్ ద్వారా పాస్ తీసుకోవాలి. అందులో ప్రత్యేకించి ఆరతి దర్శనం కోసం పాస్ తప్పనిసరిగా ఉండాలి.

5. ఆరతి దర్శనానికి పాస్ కోసం ఎంత చెల్లించాలి?
ఆరతి దర్శనానికి తప్పనిసరిగా పాస్ ఉండాలి. కానీ, ఆరతి దర్శనం ఉచితంగా భక్తులకు అనుమతి ఉంటుంది.

Ram Mandir FAQs answered for visitors

6. ఆరతి లేదా దర్శనానికి టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?
ఆరతి లేదా బాలరాముని దర్శనానికి టికెట్లను ఆలయ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. https://online.srjbtkshetra.org వెబ్ సైట్ ద్వారా దర్శన టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

7. ఆన్‌లైన్‌లో బుకింగ్ అందుబాటులో ఉందా?
ఆలయ దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ అందుబాటులో లేదు. ప్రస్తుతానికి బుకింగ్ హోల్డ్ చేసి ఉంచడం జరిగింది.

8. ఆలయ దర్శనానికి ప్రక్రియ ఏంటి?
సాధారణంగా ఆలయ దర్శనం కోసం భక్తులకు అందించే పాస్‌లపై QR కోడ్స్ ద్వారా ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది.

9. అయోధ్యకు ఎలా చేరుకోవాలంటే? :
అయోధ్య చేరుకునే భక్తులు రోడ్డు, రైలు, వాయు (విమాన) మార్గాల్లో చేరుకోవచ్చు.

10. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ఎన్నిరోజులు ఉండాలి? :
అయోధ్యలో బాలరాముని దర్శన కోసం కనీసం ఒకటి నుంచి రెండు రోజుల వరకు బస చేయాల్సి ఉంటుంది.

Read Also : అయోధ్య శ్రీరామ్ స్పెషల్ సాంగ్ విన్నారా? అమెరికా NRI సమర్పణలో..

ట్రెండింగ్ వార్తలు