Muchintal : నభూతో నభవిష్యతి, దివ్య దేశాల ఉత్సవమూర్తుల ప్రాణప్రతిష్ట

ముచ్చింతల్‌లో భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం 10వ రోజు ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం, ఉదయం 7.30 గంటలకు...

Tridandi

Equality Statue : ముచ్చింతల్‌లో భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం 10వ రోజు ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం, ఉదయం 7.30 గంటలకు శ్రీపెరుమాళ్‌ స్వామికి ప్రాతఃకాల ఆరాధన జరిగింది. ఉదయం 8 గంటలకు వేదపారాయనం చేశారు. అనంతరం శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాల్లో.. 36 దివ్యదేశాల ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట జరిగింది. స్వయంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి 36 ఉత్సవ విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేశారు.

Read More : Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

నక్షత్ర, రాశి ఆధారంగా దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట జరుగుతుందని వేద పండితులు వెల్లడిస్తున్నారు. ప్రాణప్రతిష్ట అనంతరం మహాసంప్రోక్షణ, కుంభాభిషేకాలు నిర్వహించారు. ఇప్పటికే ఈనెల 7న 108 దివ్యదేశాల్లో 32 దివ్యదేశాల ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. 10న 20 దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేశారు. ఇక 13న 20 దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేస్తారు.
అటు ఉదయం 10 గంటలకు యాగశాలలో విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టి నిర్వహించారు.

Read More : TDP MLC Ashokbabu : డీకామ్ బదులు బీకామ్ పడింది – అశోక్ బాబు.. అరెస్టును ఖండించిన బాబు

ఉదయం 10.30 గంటలకు ప్రవచన మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ అష్టోత్తర పూజ చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవచన మండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞం, రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరుగనుంది. మరోవైపు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో.. ప్రతీరోజూ పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులరాకతో సందడిగా మారింది. అటు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకుని వెళ్తున్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శ్రీరామనగరికి రానున్నారు. ఇక గురువారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శ్రీరామనగరికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.