Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు ప్రతీరోజూ తగ్గుతున్నాయి.

Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona

Coronavirus Cases Today: దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు ప్రతీరోజూ తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 58 వేల 77 కొత్త కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 657 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు 13.4 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6 లక్షల 97 వేల 802కి తగ్గాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షల 97 వేల 802కి చేరుకోగా.. అదే సమయంలో, కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షల 7 వేల 177కి పెరిగింది. లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 4 కోట్ల 13 లక్షల 31 వేల 158 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో కేరళలోనే 18వేల 420 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గడంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం బాగా పెరిగిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గిపోగా.. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగింది.

ఇక కరోనాపై యుద్ధంలో ముఖ్యమైన ఆయుధంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 172 కోట్ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి. నిన్న ఒక్కరోజే 48 లక్షల 18 వేల 867 డోసులు ఇవ్వగా ఇప్పటి వరకు 172 కోట్ల 79 లక్షల 51 వేల 432 డోసుల వ్యాక్సిన్‌ను అందించారు.