Ganesh Chaturthi 2023 : మొదటి పూజ గణపతికే ఎందుకు చేస్తారో తెలుసా?

ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా.. ఏ పూజలు చేసినా ముందుగా గణపతిని పూజిస్తారు. మొదటి పూజలు అందుకునేది గణేశుడే. అసలు వినాయకుడికి మొదటి పూజ ఎందుకు చేస్తారో తెలుసా?

Ganesh Chaturthi 2023

Ganesh Chaturthi 2023 : ప్రతి గుడిలో, ఇంట్లో గణపతి విగ్రహం ఉంటుంది. ఏ పూజా కార్యక్రమం నిర్వహించినా, ఏ పని కొత్తగా తలపెట్టినా గణపతిని పూజిస్తారు. మొదటి పూజ గణపతికే ఎందుకు చేస్తారో తెలుసా?

Ganesh Chaturthi: వినాయక చవితి, నిమజ్జనంపై క్లారిటీ వచ్చేసింది.. గణేశుడి పండగ ఎప్పుడంటే?

వినాయకుడు కష్టాల నుంచి ఆదుకుంటాడని.. ఏ పని తలపెట్టినా అడ్డంకులు రాకుండా రక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. ఏ పూజ చేసినా మొదటి పూజ గణేశునికే. పెళ్లి శుభలేఖలు, సందర్భాన్ని బట్టి వేసే ప్రతి కార్డులపై గణపతి చిత్రాలను ముద్రిస్తారు. వినాయకుడిని ఎందుకు ఇలా పూజిస్తారు అంటే పురాణాల ప్రకారం ఒకరోజు పార్వతీ దేవి గణేశుని ద్వారం వద్ద కాపలా ఉంచి ఎవరైనా వస్తే వారిని అడ్డుకోమని సూచిస్తుంది. వినాయకుడు ద్వారం వద్ద కాపలా ఉన్న సమయంలో శివుడు లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. అయితే గణపతి లోనికి వెళ్లనివ్వలేదు. కోపం వచ్చిన శివుడు వినాయకుడి తలను వధించాడు.

గణేశుని కేకలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చి అతని దయనీయ పరిస్థితిని చూసి కోపం తెచ్చుకుంటుంది. ఆ బాలుడుని తిరిగి పొందకపోతే ప్రపంచాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తుంది. పార్వతీదేవి ఆగ్రహాన్ని చూసి శివుడు ఏనుగు తలను మార్చి గణపతిని బ్రతికిస్తాడు. అంతేకాదు గణేశుడిని పూజించకుండా ఎలాంటి పూజలు చేయకూడదని వరం ప్రసాదించాడు. శివుడు గణపతికి అపారమైన శక్తిని కూడా అనుగ్రహించాడు. యోగ విశ్వాసం ప్రకారం గణపతి మూలాధార చక్రాన్ని నియంత్రిస్తాడని చెబుతారు. ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఏదైనా పనులు ప్రారంభించే ముందు ఆయనను ప్రార్థిస్తారు.

Vinayaka Chaviti 2023 : వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి.. సెప్టెంబర్ 18, లేదా 19..? పండితులు ఏం చెబుతున్నారు?

ఏనుగు తల, పెద్ద చెవి, పెద్ద పొట్ట ఉన్న ఏకైన దేవుడు గణేశుడు. ఏనుగు తల జ్ఞానానికి సూచన. పెద్ద చెవిలో ఏది చెప్పినా ఆయన వింటాడని నమ్ముతారు. విఘ్నాలను తొలగించి కష్టాల నుంచి కాపాడే గణపతిని ప్రార్థించడం వల్ల జీవితంలోని దురదృష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఏ పూజ తలపెట్టినా ముందు గణేశుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ట్రెండింగ్ వార్తలు