Tirumala Special Entry Darshan : అక్టోబర్ నెలకు రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్దం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈరోజు ఉదయం ఆన్ లైన్ లో విడుదల చేసింది. 

Ttd Special Entry Darshan Tickets

Tirumala Special Entry Darshan : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్దం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈరోజు ఉదయం ఆన్ లైన్ లో విడుదల చేసింది.  టైం స్లాట్ ప్రకారం భక్తులు గోవింద యాప్ లోనే కాక టీటీడీ వెబ్ సైట్ లో కుడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

మరోవైపు రేపటినుంచి రోజుకు 8 వేల చొప్పున సర్వదర్శనం టొకెన్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 26 నుంచి 31 వరకు రోజుకు 8 వేల చొప్పును సర్వదర్శనం టొకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
Also Read : Tirumala Sarva Darshanam : సర్వదర్శనం టోకెన్ల కోసం శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ ఉండాలి లేదా మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్ సర్ఠిఫికెట్ తేవాలని టీటీడీ పేర్కోంది.