×
Ad

IND vs NZ : అయ్యో పాపం.. ఒక్క బంతికే 11 పరుగులు! ఇషాన్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన కివీస్ బౌలర్

IND vs NZ : మరోవైపు.. జకారీ ఫౌల్క్స్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాఛ్ లో మూడు ఓవర్లలో అత్యధిక ఎకానమీ నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు

IND vs NZ

  • భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన
  • ఒకే బంతికి 11 పరుగులు ఇచ్చిన కివీస్ బౌలర్ జకారీ ఫౌల్క్స్
  • 3ఓవర్లు 63 పరుగులు.. చెత్త రికార్డు నమోదు

IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి రాయ్‌పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.. భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 209 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే, ఈ మ్యాఛ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే బంతికి 11 పరుగులు వచ్చాయి.

Also Read : IND vs NZ : ఇలా అయితే వాళ్లతో కష్టమే..! అందుకే ఓడిపోయాం.. ఓటమిపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సంచలన కామెంట్స్..

భారత ఇన్నింగ్స్ సందర్భంగా మూడో ఓవర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కివీస్ యువ బౌలర్ జకారీ ఫౌల్క్స్ మూడో ఓవర్ వేశాడు. క్రీజులో ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఫౌల్క్స్ వేసిన మొదటి బంతే నో-బాల్ అయింది. ఆ బంతిని ఇషాన్ బౌండరీ తరలించాడు. అయితే, ఆ బంతి వేసే క్రమంలో ఫౌల్క్స్ నాన్ స్ట్రైకర్ స్టంప్స్‌ను పడేశాడు. దీంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు. దీంతో ఫ్రీహిట్ బంతికి బౌండరీ రావొద్దనే ప్రయత్నంలో ఆ తరువాత రెండు బంతులను ఫౌల్క్స్ వైడ్స్ సంధించాడు. ఆ తరువాతి బంతిని ఇషాన్ బౌండరీ కొట్టాడు. దీంతో అధికారికంగా ఒక బంతికి 11 పరుగులు (4nb, wd, wd, 4) వచ్చినట్లయింది.

Also Read : IND vs NZ : లంచ్‌లో అతను ఏం తిన్నాడో కానీ.. నాకు కోపం వచ్చింది.. ఆ యువ బ్యాటర్‌పై సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్..

మరోవైపు.. జకారీ ఫౌల్క్స్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాఛ్ లో మూడు ఓవర్లలో అత్యధిక ఎకానమీ నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు. సెర్బియా స్పిన్నర్ డిజిజా (బల్గేరియాపై మూడు ఓవర్లలో 63 పరుగులు, 21 ఎకానమీ) పేరిట ఉన్న రికార్డును జకారీ ఫౌల్క్స్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో అతను మూడు ఓవర్లలో ఏకంగా 67 పరుగులు (22.3ఎకానమీ) సమర్పించుకున్నాడు. వరుసగా మూడు ఓవర్లలో (24, 25, 18) పరుగులు ఇచ్చుకున్నాడు.