IND vs NZ : లంచ్‌లో అతను ఏం తిన్నాడో కానీ.. నాకు కోపం వచ్చింది.. ఆ యువ బ్యాటర్‌పై సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్..
IND vs NZ : చాలా రోజుల తరువాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించిందని సూర్యకుమార్ పేర్కొన్నారు.
suryakumar yadav
- భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
- ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం
- ఇషాన్ కిషన్ ఆటతీరుపై సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్
IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి రాయ్‌పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు.
తన రీఎంట్రీ మ్యాచ్‌లో విఫలమైన వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. కేవలం 32 బంతుల్లోనే 11 ఫోర్లు నాలుగు సిక్స్‌ల సహాయంతో 76 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37బంతుల్లో 9ఫోర్లు, నాలుగు సిక్సుల సహాయంతో 82 (నాటౌట్) పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 15.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ISHAN KISHAN HAMMERED 76 (32) WHEN INDIA WERE 6/2. 🫡🇮🇳pic.twitter.com/rGfROen3dj
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2026
ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో, మ్యాచ్‌కు ముందు ఏ ప్రీ- వర్కౌట్ డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ, అతను బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. పవర్ ప్లేలో తొలి రెండు ఓవర్లలో మాకు కేవలం ఎనిమిది పరుగులే వచ్చాయి. అటువంటిది పవర్ ప్లేను 75 పరుగులతో ముగించడం నిజంగా చాలా గ్రేట్. ఆ క్రెడిట్ మొత్తం ఇషాన్ కిషన్ కే దక్కాలని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.
ఒకానొక దశలో ఇషాన్ కిషన్‌పై నాకు కోపం వచ్చిందంటూ సూర్యకుమార్ సరదా కామెంట్స్ చేశాడు. ఎందుకంటే.. పవర్ ప్లేలో ఇషాన్ నాకు స్ట్రైక్ అస్సలు ఇవ్వలేదు. అయితే, అతని దూకుడైన బ్యాటింగ్‌తో నేను క్రీజులో కుదురుకోవడానికి సమయం దొరికిందని సూర్యకుమార్ పేర్కొన్నాడు. చాలా రోజుల తరువాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించిందని సూర్యకుమార్ పేర్కొన్నారు.
కుల్దీప్ యాదవ్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. దూబే కూడా కీలక ఓవర్ బౌలింగ్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ప్రస్తుతం ఎంతో బాగుంది. రాబోయే మ్యాచ్‌లలోనూ ఇదే ఆటతీరును కనబరుస్తామని సూర్యకుమార్ ధీమాను వ్యక్తం చేశారు.
THE FASTEST 200+ RUN CHASE IN T20I HISTORY. 🥶🇮🇳
– India chased down 209 in just 15.2 overs.
pic.twitter.com/8JNVRnH6qp— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2026
