IPL 2020 MI vs SRH: మ్యాచ్‌ను మలుపులు తిప్పగల 11మంది ఆటగాళ్లు వీళ్లే!

  • Published By: vamsi ,Published On : October 4, 2020 / 01:44 PM IST
IPL 2020 MI vs SRH: మ్యాచ్‌ను మలుపులు తిప్పగల 11మంది ఆటగాళ్లు వీళ్లే!

Updated On : October 4, 2020 / 2:15 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. టోర్నమెంట్‌లో హైదరాబాద్ బౌలర్లు, యువ ఆటగాళ్ల ప్రతిభతో చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించారు.

మ్యాచ్‌లో ముఖ్యమైన ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు:

డేవిడ్ వార్నర్: ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఈ టోర్నమెంట్‌లో ఊహించిన విధంగా ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కానీ ముంబయితో జరిగే మ్యాచ్‌లో మాత్రం వార్నర్ తన సత్తా నిరూపించగలడు. షార్జా చిన్న మైదానం కావడంతో వార్నర్ పెద్ద పెద్ద షాట్లు కొట్టగలడు. ముంబై ఇండియన్స్‌లో కూడా వార్నర్‌ను ఆపగల ఆఫ్ స్పిన్నర్ లేకపోవడం సన్‌రైజర్స్‌కు కలిసి వచ్చే అంశం.

రోహిత్ శర్మ: ఈ సీజన్ ఐపీఎల్ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ 80, 70 పరుగుల రెండు పెద్ద ఇన్నింగ్స్‌తో ఇప్పటికే ఆకట్టుకున్నాడు. ఆరంభంలో రోహిత్ శర్మను ఆపడానికి హైదరాబాద్ జట్టు లెగ్ స్పిన్నర్‌ను ఉపయోగించకపోతే, ఈ బ్యాట్స్ మాన్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను తిప్పగలడు.

కిరణ్ పొలార్డ్: ఈ ఆటగాడు ఐపీఎల్‌లో, సిపిఎల్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఉన్నాడు. హైదరాబాద్‌కు అనుభవజ్ఞుడైన బౌలర్ లేనందున, పొలార్డ్ డెప్త్ ఓవర్లలో చాలా పరుగులు చేయగలడు. Bhuvneshwar Kumar బౌలింగ్‌లో పోలార్డ్‌కు పేలవమైన రికార్డ్ ఉంది. భువనేశ్వర్ కుమార్ ఇప్పటికి మూడు సార్లు పోలార్డ్‌ను అవుట్ చేశాడు. అయితే భువి గత మ్యాచ్‌లో గాయం కారణంగా మ్యాచ్ నుంచి బయటకు వెళ్లాడు. చివర్లో ఓవర్ కూడా వెయ్యలేదు. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.

డి కాక్: ముంబైతో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకుంటే మాత్రం.. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లపై డి కాక్ రికార్డు అద్భుతంగా ఉంది.

కెన్ విలియమ్సన్: న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ మిడిల్ ఆర్డర్‌లో బలమైన బ్యాట్స్‌మన్‌గా సన్‌రైజర్స్‌కు పనికి వస్తాడు. కేన్ మీడిల్ ఆర్డర్‌లో సగటున 52పరుగులతో.. 144 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు రాబట్టగలడు. ముంబైతో జరిగే మ్యాచ్‌లో కేన్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలడు.

అద్భుతాలు చేయగల ఆరుగురు బౌలర్లు:

రషీద్ ఖాన్: హైదరాబాద్ టోర్నమెంట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి రషీద్ ఖాన్ ముఖ్యమైన పాత్ర పోషించారు. రషీద్ ఖాన్ ముంబైని ఇబ్బంది పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

జస్‌ప్రీత్ బుమ్రా: ముంబై ఇండియన్స్ ఆశలన్నీ బుమ్రా పైనే ఉన్నాయి. బుమ్రా ప్రస్తుతం డెప్త్ ఓవర్లలో అత్యుత్తమ బౌలర్. కాగా ఈ సిరీస్‌లో ఇంకా తన మార్క్ ఆటను ప్రదర్శించలేదు.

ట్రెంట్ బోల్ట్: వార్నర్ మరియు బెయిర్‌స్టో ఇద్దరూ ఫార్వర్డ్ బంతులను ఆడటంలో కొంత ఇబ్బంది పడుతారు. బోల్ట్‌కు ఈ విషయంలో నైపుణ్యం ఉంది.ఇద్దరు ఆటగాళ్ల బలహీనతను సద్వినియోగం చేసుకునేందుకు బోల్ట్ ఉపయోగపడతాడు.

రాహుల్ చాహర్: రాహుల్ చాహర్ వంటి బౌలర్‌కు షార్జా స్టేడియంలో వికెట్లు తియ్యడానికి బాగా ఉపయోగపడుతుంది.

నటరాజన్: హైదరాబాద్ బౌలింగ్‌కు యువ ఆటగాడు నటరాజన్ నాయకత్వం వహిస్తాడు. నటరాజన్ తన యార్కర్‌లతో ముంబైని స్కోర్ చెయ్యకుండా ఆపగలడు.

జేమ్స్ ప్యాటిన్సన్: ఏదైనా బ్యాటింగ్ లైనప్‌ను తొలగించగల సామర్థ్యం ప్యాటిన్సన్‌కు ఉంది.