Cricket World Cup Team Member: టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్స్ టీం క్రికెటర్ రోజుకూలీగా..
జాతీయ క్రీడ కాకపోయినా.. ఇండియాలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్. అది కూడా పాకిస్తాన్‌పై మ్యాచ్ అంటే విపరీతమైన కుతూహలం. ఆ టీంపైన వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్‌లో విజయం సాధించినా క్రికెటర్ల పరిస్థితి మారలేదు.

Blind Cricket
Cricket World Cup Team Member: జాతీయ క్రీడ కాకపోయినా.. ఇండియాలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్. అది కూడా పాకిస్తాన్‌పై మ్యాచ్ అంటే విపరీతమైన కుతూహలం. ఆ టీంపైన వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్‌లో విజయం సాధించినా క్రికెటర్ల పరిస్థితి మారలేదు. గుజరాత్‌కు చెందిన నరేష్ తుమ్డా టీమిండియా బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
జీవనోపాధి కోసం నానా తంటాలు పడుతున్న రోజు కూలిగా మారాడు. ఈ పరిస్థితి చూసి ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు.
2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన విన్నింగ్ టీమ్‌లో నరేష్ తుమ్డా ఆడాడు. షార్జా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. కట్ చేస్తే.. అంధుడైన నరేష్ నవ్‌సారీలో కార్మికుడిగా రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదన కోసం పనిచేస్తున్నాడు. ఆదుకోమంటూ 3సార్లు గుజరాత్ సీఎంను కలిసినా ప్రయోజనం లేదని వాపోతున్నాడు.
వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికి 5సార్లు పోటీలు జరగ్గా 2018 జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ని ఓడించింది. 308 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరీ ఈ విజయాన్ని దక్కించుకుంది. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో నిర్వహించారు.