ప్లేఆఫ్స్‌ ముందు ఆర్సీబీకి భారీ దెబ్బ.. రజత్ పటీదార్ సహా నలుగురు కీలక ప్లేయర్లు ఇక ఆడరా?

ఫిల్ సాల్ట్ పరిస్థితి ఏంటి?

Pic: @BCCI

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లు ప్రారంభం కానున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ దెబ్బ తగలనుంది. ఆ జట్టులోని నలుగురు ముఖ్యమైన ప్లేయర్లు మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌ కన్ఫర్మ్ అవుతుంది. ఈ సమయంలో కీలక ప్లేయర్లు ఆ జట్టుకు దూరమయ్యే ప్రమాదం కనపడుతోంది.

రజత్ పటీదార్‌ ఆడతాడా?
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా కొట్టిన షాట్‌ను ఆపడానికి ప్రయత్నించిన సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదర్ చేతి వేలికి గాయమైంది. ఆ తర్వాత రజత్ పటీదార్ చేతికి బ్యాండేజ్‌ కట్టుకుని కనపడ్డాడు.

Also Read: ఫోల్డబుల్ ఫోన్ల హవా.. శాంసంగ్ Galaxy Z Flip 7 ఫీచర్లు అదరహో.. అవేంటో తెలుసుకోవాల్సిందే..

ఫిల్ సాల్ట్ పరిస్థితి?
జ్వరం కారణంగా ఇటీవల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జాకబ్ బెథెల్ ఓపెనర్‌గా ఆడాడు. ఈ ఐపీఎల్‌లో మొత్తం 9 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 26.55, స్ట్రైక్ రేట్ 168.30గా ఉంది. 2 అర్ధ సెంచరీలు కొట్టాడు.

జోష్ హేజిల్‌వుడ్ మళ్లీ వస్తాడా?
భుజం సమస్య కారణంగా గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడు కోలుకుంటాడని ఆర్సీబీ భావిస్తోంది. 10 మ్యాచ్‌లలో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్ గా కొనసాగుతున్నాడు.

రొమారియో షెపర్డ్ సంగతేంటి?
రొమారియో షెపర్డ్ వెస్టిండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అతడిని వెస్టిండీస్ 15 మంది సభ్యుల వన్డే స్క్వాడ్‌లో ఎంపిక చేశారు. ఆ జట్టు ఇంగ్లాండ్, ఐర్లాండ్ తో సిరీస్ ఆడాల్సి ఉంది. ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ మే 21న ప్రారంభమవుతుంది. IPL 2025 ప్లేఆఫ్‌లు మే 20న ప్రారంభమవుతాయి. దీంతో అతడు ఆర్సీబీ తరఫున ప్లేఆఫ్‌ల్లో ఆడకపోవచ్చు.