ఫోల్డబుల్ ఫోన్ల హవా.. శాంసంగ్ Galaxy Z Flip 7 ఫీచర్లు అదరహో.. అవేంటో తెలుసుకోవాల్సిందే..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లే కాకుండా మరో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు కూడా వస్తున్నాయి.

ఫోల్డబుల్ ఫోన్ల హవా.. శాంసంగ్ Galaxy Z Flip 7 ఫీచర్లు అదరహో.. అవేంటో తెలుసుకోవాల్సిందే..

Updated On : May 7, 2025 / 9:29 PM IST

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 7 స్మార్ట్‌ఫోన్లను కొన్ని నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఇవి నెక్స్ట్‌ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్‌లు. డిజైన్, పర్ఫార్మన్స్‌ అప్‌గ్రేడ్‌లతో వస్తున్నాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లే కాకుండా మరో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు కూడా వస్తున్నాయి. అందులో ఒకటి ట్రిపుల్-ఫోల్డ్ పరికరం దీని పేరు ఇంకా తెలియరాలేదు. ఇక శాంసంగ్ నుంచి రానున్న మరో స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్‌ఈ.

తాజాగా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్‌ఈకి సంబంధించిన ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6లాగే కొత్తగా రానున్న గెలాక్సీ ఫ్లిప్ 7 ఎఫ్‌ఈ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అయితే, జెడ్ ఫ్లిప్ 6 కన్నా గెలాక్సీ ఫ్లిప్ 7 ఎఫ్‌ఈ ధర తక్కువగా ఉండనుంది.

Also Read: కెవ్వుకేక.. ఈ OnePlus స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇప్పుడే కొనేస్తే సరీ..

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్‌ఈ ఫీచర్లు
ప్రాసెసర్, RAM: Snapdragon 8 Gen 3 చిప్‌, 12GB RAM ఉంటుందని అంచనా

కెమెరాలు: 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా, అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి

బ్యాటరీ, ఛార్జింగ్: 4,000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్

డిస్ప్లే: 6.7-అంగుళాల LTPO AMOLED మెయిన్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్

ధర: సుమారు రూ.96,000

లాంచ్ టైమ్‌లైన్: Z Flip 7 ఈ ఏడాది జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Z Flip 7 FE మాత్రం కొన్ని నెలల తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung ఈ రెండు మోడళ్లను ఒకేసారి లాంచ్ చేయకపోవచ్చు