కెవ్వుకేక.. ఈ OnePlus స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇప్పుడే కొనేస్తే సరీ..

బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొటే అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది.

కెవ్వుకేక.. ఈ OnePlus స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇప్పుడే కొనేస్తే సరీ..

oneplus nord ce4 lite 5g

Updated On : May 7, 2025 / 7:30 PM IST

తక్కువ ధరకు మంచి ఫీచర్లు ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని అనుకుంటున్నారా? అయితే, OnePlus Nord CE4 Lite 5G మంచి ఆప్షన్. ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది జూన్‌లో భారత్‌లో లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 128GB వేరియంట్ ఎంఆర్‌పీ ధర రూ.20,999గా ఉండగా, 14 శాతం డిస్కౌంట్‌తో రూ.17,998కే లభ్యమవుతోంది. అంతేగాక పలు బ్యాంక్‌ ఆఫర్లతో మరింత డిస్కౌంట్‌ దక్కుతుంది.

Also Read: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్‌.. ఇదేం విధ్వంసం భయ్యా.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా..

అమెజాన్ రూ.400 కూపన్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొటే అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో OnePlus Nord CE4 Lite 5G ధర రూ.15,598కి తగ్గుతుంది. ఇంకా అమెజాన్ రూ.16,850 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ విలువ రూ.5,000 అయితే, మీరు OnePlus Nord CE4 Lite 5Gని రూ.11,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord CE4 Lite 5G ఫీచర్లు
డిస్ప్లే: 6.67-అంగుళాల పూర్తి HD+ OLED స్క్రీన్
రిఫ్రెష్ రేట్: స్మూత్ 120Hz
బ్రైట్‌నెస్‌: 2100 నిట్స్ పీక్
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 6nm 5G చిప్‌సెట్
RAM, స్టోరేజ్: 8GB RAM, 256GB స్టోరేజ్, మైక్రో SD కార్డ్ 1TB వరకు సపోర్ట్
బ్యాటరీ: 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 14