ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్‌.. ఇదేం విధ్వంసం భయ్యా.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా..

ఇటువంటి బ్యాటర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే లేడు.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్‌.. ఇదేం విధ్వంసం భయ్యా.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా..

Pic :@BCCI

Updated On : May 8, 2025 / 8:43 PM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో చేసే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మొత్తం 510 పరుగులు బాదాడు. నిన్న ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 35 రన్స్ చేసి ఈ ఘనత సాధించాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్ ఐపీల్‌ చరిత్రలో 500 పరుగులు చేయడం ఇది మూడోసారి. ముంబై నుంచి మూడుసార్లు 500 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. అతడు 2018, 2023, 2025 ఐపీఎల్‌ సీజన్లలో 500 పరుగుల కన్నా ఎక్కువ చొప్పున బాదాడు.

ఐపీఎల్‌లో 500 పరుగులు చేసిన ఆటగాళ్లు మరో ఏడుగురు ఉన్నారు. వారిలో క్వింటన్ డి కాక్, సచిన్ టెండూల్కర్ రెండేసి సార్లు 500 పరుగులు చేశారు. క్వింటన్ డి కాక్ 2019, 2020 ఐపీఎల్‌ సీజన్లలో, సచిన్ టెండూల్కర్ 2010, 2011 సీజన్లలో 500కు మించి పరుగులు బాదారు.

Also Read: అట్లుంటది మోదీతోని.. పాక్‌ను ఎలా ఏమార్చారు? ఊహకు అందని రీతిలో.. చెప్పింది చెప్పినట్లుగానే..

ఇక రోహిత్ శర్మ (2013 సీజన్‌లో) సనత్ జయసూర్య (2008), ఇషాన్ కిషన్ (2020), దినేశ్ కార్తీక్ (2013), లెండిల్ సిమన్స్ (2015) ఒక్కో సారి 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు.

ఆల్‌టైమ్ ఐపీఎల్‌ రికార్డ్
సూర్యకుమార్‌ యాదవ్‌ మరో రికార్డును కూడా సాధించాడు. 170కి పైగా స్ట్రైక్‌రేటుతో 500కు పైగా పరుగులు సాధించిన బ్యాటర్లు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ పేరు రెండుసార్లు ఉంది.

ఇప్పటివరకు 170కి పైగా స్ట్రైక్‌రేటుతో రెండుసార్లు 500కు పైగా పరుగులు సాధించిన బ్యాటర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే లేడు. నిన్నటి మ్యాచుతో ఐపీఎల్‌ 2025 సీజన్‌లో సూర్యకుమార్ 170 స్ట్రైక్‌రేటుతో 510 పరుగులు సాధించగా, 2023 ఐపీఎల్‌ సీజన్‌లో 181.13 స్ట్రైక్‌రేటుతో 604 పరుగులు చేశాడు.

కెవ్వుకేక.. ఈ OnePlus స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇప్పుడే కొనేస్తే సరీ..