ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఐపీఎల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా చెన్నైసూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకో మీకు కూడా తెలుసు.. ధనాధన్ ధోనీ తిరిగి వస్తున్నాడు.
భారత మాజీ కెప్టెన్ ధోనీ గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ నిష్ర్కమించినప్పుటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ 13వ సీజన్‌లో CSK సారథ్యం వహించేందుకు తిరిగి వస్తున్నాడు. ఐపీఎల్ ముందే ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు కూడా. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో నెట్ ఫ్రాక్టీస్ ట్రైనింగ్ ఆడుతూ కనిపించాడు.
ధోనీ సరిగా ఆడలేకపోతున్నాడు. మునపటిలా షాట్లు కొట్టలేకపోతున్నాడని విమర్శించేవారికి తన సత్తువా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు ధోనీ. నెట్ ప్రాక్టీస్ ఇరగదీశాడు. వరుసగా 5 సిక్సులు కొట్టి తన బ్యాటింగ్ రుచి ఏంటో చూపించాడు.
ధోనీ నెట్ ఫ్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి స్టార్ స్పోర్ట్స్ తమిళ్ తమ సోషల్ అకౌంట్లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ ధోనీ.. బౌలర్ వేసిన బంతులను షాట్స్ ఆడుతున్నాడా? లేదా బాల్ మిషన్ విసిరిన బంతులను షాట్ ఆడుతున్నా అనేది స్పష్టత లేదు.
కానీ, వరుసగా ఐదు సిక్సులతో భారీ షాట్స్ ఆడుతూ 38ఏళ్ల ధోనీ తన బ్యాటింగ్ లో సామర్థ్యం ఇంకా తగ్గలేదని నిరూపించాడు. మార్చి 29న చపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
మార్చి 2 నుంచి ధోనీ చెన్నైలో తన తోటి ఆటగాళ్లతో కలిసి ట్రైనింగ్ ప్రారంభించాడు. గత జనవరిలో బీసీసీఐ తమ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుంచి ధోనీని తప్పించిన సంగతి తెలిసిందే.
BALL 1⃣ – SIX
BALL 2⃣ – SIX
BALL 3⃣ – SIX
BALL 4⃣ – SIX
BALL 5⃣ – SIXஐந்து பந்துகளில் ஐந்து சிக்ஸர்களை பறக்கவிட்ட தல தோனி!
முழு காணொளி காணுங்கள் ??
#⃣ “The Super Kings Show”
⏲️ 6 PM
? ஸ்டார் ஸ்போர்ட்ஸ் 1 தமிழ்
? மார்ச் 8
➡️ @ChennaiIPL pic.twitter.com/rIcyoGBfhE— Star Sports Tamil (@StarSportsTamil) March 6, 2020
See Also | ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు..