Team India : వారెవ్వా క్యా క్యాచ్ హై, హర్లీన్ డియోల్ అద్భుత క్యాచ్
భారత్- ఇంగ్లండ్ అమ్మాయిల టీ20 మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా ఫీల్డర్ హర్లీన్ డియోల్ పట్టిన క్యాచ్ హైలెట్ అయ్యింది. వారెవ్వా అనిపించింది. బౌండరీ లైన్ దగ్గర హర్లిన్ తీసుకున్న ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Harleen Deol Catch
Harleen Deol Catch : భారత్- ఇంగ్లండ్ అమ్మాయిల టీ20 మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా ఫీల్డర్ హర్లీన్ డియోల్ పట్టిన క్యాచ్ హైలెట్ అయ్యింది. వారెవ్వా అనిపించింది. బౌండరీ లైన్ దగ్గర హర్లిన్ తీసుకున్న ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మొదట ఇంగ్లండ్ అమ్మాయిలు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. అమీజోన్స్ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ దూకుడు మీదుంది.
ఈ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో శిఖా పాండే బౌలింగ్‌లో అమీ భారీ షాట్ ఆడింది. బౌండరీ వద్ద ఆ బంతిని అందుకొనేందుకు హర్లీన్ డియోల్ అద్భుతమే చేసింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్ చేసి అందుకొంది. అయితే బౌండరీ దాటుతున్నానని గ్రహించి బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్ చేసింది. ఈ క్యాచ్‌ను అమీ నమ్మలేకపోయింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. క్రికెటర్లు, క్రీడాభిమానులు వారెవ్వా హర్లిన్ అని ప్రశంసిస్తున్నారు.
A fantastic piece of fielding ?
We finish our innings on 177/7
Scorecard & Videos: https://t.co/oG3JwmemFp#ENGvIND pic.twitter.com/62hFjTsULJ
— England Cricket (@englandcricket) July 9, 2021