Aaron Finch: ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంపై ఆరోన్ ఫించ్ ఏమన్నారంటే?

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన IPL మెగా వేలంలో ఏ జట్టు కూడా తనను కొనుగోలు చేయనందుకు ఆశ్చర్యం లేదని అన్నారు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్.

Aaron Finch: ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంపై ఆరోన్ ఫించ్ ఏమన్నారంటే?

Finch

Updated On : February 19, 2022 / 1:11 PM IST

Aaron Finch: ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన IPL మెగా వేలంలో ఏ జట్టు కూడా తనను కొనుగోలు చేయనందుకు ఆశ్చర్యం లేదని అన్నారు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్. అదే సమయంలో, అతను ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు.

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ చివరిసారిగా IPL 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడాడు. అయితే, సీజన్ ముగిసిన తర్వాత అతన్ని ఫ్రాంచైజీ రిలీజ్ చేసేసింది. అయితే, IPL 2021కి ముందు జరిగిన వేలంలో మాత్రం ఫించ్ అమ్ముడుపోలేదు. 2022లో T20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించిన ఫించ్‌ని మెగా వేలంలో 10 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్కటీ తీసుకోలేదు.

తనను ఐపీఎల్‌లో తీసుకోకపోవడంపై ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. “నాకు IPLలో ఆడటం అంటే చాలా ఇష్టం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత ఫ్రాంచైజీల నిర్మాణం చాలా బలంగా ఉంది. భారత్‌లో చాలామంది టాప్-ఆర్డర్ ప్లేయర్లు ఉన్నారు. ముందుగా వారికి ప్రాధాన్యం ఇస్తారు. వారు కచ్చితంగా లోకల్‌గా గట్టిగా ఆడగలరు. బహుశా ఈ కారణంతోనే తనకు స్థానం దక్కకపోయి ఉండవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చాలా జట్లలో ఆటగాళ్లకు ఈసారి అవకాశం దక్కలేదు. తనకు సరిపడిన స్థానం కూడా ఆయా జట్లలో లేకపోయి ఉండవచ్చు. దేశీయమైనా, అంతర్జాతీయమైనా.. ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఆడేవారు కచ్చితంగా పవర్ హిట్టర్ అయి ఉండాలి అది నేను కాదు అని భావించి కూడా ఉండవచ్చు.

ఫించ్‌తో పాటు లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెన్ మెక్‌డెర్మాట్, పేసర్లు ఆండ్రూ టై, బెన్ ద్వార్షుయిస్, కేన్ రిచర్డ్‌సన్ వంటి అతని సహచరులు, ఆల్ రౌండర్లు మోయిసెస్ హెన్రిక్స్, బెన్‌సట్టింగ్‌లను కూడా ఈసారి IPL మెగా వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు.

ఆస్ట్రేలియా వైట్-బాల్ కెప్టెన్ IPL చరిత్రలో 85 మ్యాచ్‌లలో 25.71 సగటుతో 14 అర్ధ సెంచరీలతో 2005పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఫించ్.. 2020 ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.