Abhimanyu Mishra : చెస్ క్రీడలో న్యూ రికార్డు, 12 ఏళ్లకే చెస్ గ్రాండ్‌మాస్టర్

Chess
Youngest Grandmaster : చెస్ క్రీడల్లో చిన్నారి న్యూ రికార్డు నెలకొల్పాడు. 12 ఏళ్లు నిండకుండానే..గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. అతనే అభిమన్యు మిశ్రా. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో చెస్ లో గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. 15 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ లియోన్ లూర్ మెన్డోకాను ఓడించాడు. 2009 ఫిబ్రవరి 05వ తేదీన అభిమన్యు జన్మించాడు. 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వయస్సున్న ఇతను…ప్రతి పోటీలోనూ సత్తా చాటుతూ..దూసుకెళుతున్నాడు.
కరోనా కారణంగా..కొన్ని క్రీడలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కొన్ని ఆంక్షల మధ్య పోటీలు నిర్వహిస్తున్నారు. బుడాబెస్ట్ గ్రాండ్ మాస్టర్ చెస్ పోటీల్లో అభిమన్యు మిశ్రా పాల్గొన్నాడు. ఏప్రిల్ నుంచి హంగేరీలో ఉన్న ఇతను..అదే నెలలో తొలి, మేలో రెండో జీఎం నార్మ్స్ పొందాడు. మూడో జీఎం నార్మ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెర్గీ కర్జాకిన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. మూడు సంవత్సరాల క్రితం కర్జాకిన్ 12 సంవత్సరాల 7 నెలల వయస్సులో గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. ఇప్పుడది కనుమరుగైంది. గత సంవత్సరం ఇంటర్నేషనల్ మాస్టర్ గా అభిమన్యు అవతరించాడు.