RCB vs SRH : స‌న్‌రైజ‌ర్స్‌తో బెంగ‌ళూరు మ్యాచ్‌.. బెంచీపై రూ.47 కోట్లు..

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌తీరు మార‌లేదు.

RCB vs SRH – IPL 2024 : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌తీరు మార‌లేదు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచులు ఆడ‌గా ఆరింటిలో ఓడిపోయింది. రెండు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో కొన‌సాగుతోంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ‌కు గురి అయ్యారు. ఈ సారి కూడా క‌ప్పు క‌ష్ట‌మే అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ త‌న జ‌ట్టులో భారీ మార్పులే చేసింది. ధారాళంగా ప‌రుగులు ఇస్తున్న మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను ప‌క్క‌న బెట్టింది. స్టార్ ఆట‌గాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ లను బెంచీకే ప‌రిమితం చేసింది. అయిన‌ప్ప‌టికీ ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 25 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ..! పాండ్యా ఔట్?

కాగా.. ఆర్‌సీబీ ఓట‌ముల‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు అభిన‌వ్ ముకుంద్ స్పందించాడు. బెంచీపై రూ.47కోట్ల ఉన్నాయంటూ సెటైర్లు వేశాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్ (రూ.17.5కోట్లు), అల్జారీ జోసెఫ్ (రూ.11.5 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.11కోట్లు), మ‌హ్మ‌ద్ సిరాజ్ (రూ.7కోట్లు) ల‌ను తుది జ‌ట్టులో ఆడించ‌కుండా బెంచీకే ప‌రిమితం చేయ‌డం పై ఇలా వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. ఈ న‌లుగురిని వేలంలో ద‌క్కించుకున్న ధ‌ర‌ను ప్ర‌స్తావిస్తూ..17.5+11.5+11+7 = 47 కోట్లు ను బెంచీ పై కూర్చోబెట్టారు అని సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 287 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (102 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) సెంచ‌రీతో రాణించ‌గా, హెన్రిచ్ క్లాసెన్ (67 31 బంతుల్లో 2ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

Shah Rukh Khan : ‘గౌత‌మ్ గంభీర్ మీరు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు..’ : షారుఖ్ ఖాన్‌

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 262 ప‌రుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (83 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడినా 25 ప‌రుగుల తేడాతో ఆర్‌సీబీకి ఓట‌మి త‌ప్ప‌లేదు.

ట్రెండింగ్ వార్తలు