×
Ad

Abhishek Nayar : ఐపీఎల్ 2026కి ముందు కీల‌క మార్పు.. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్ (Abhishek Nayar)నియ‌మితుల‌య్యాడు.

Abhishek Nayar Appointed as Head Coach Of KKR

Abhishek Nayar : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టుకు హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్‌ (Abhishek Nayar)ను నియ‌మించింది. ఆయ‌న చంద్ర‌కాంత్ పండిట్ స్థానంలో వ‌చ్చారు. ఐపీఎల్ సీజ‌న్ 2025 ముగిసిన త‌రువాత చంద్ర‌కాంత్ పండిట్ కేకేఆర్ హెడ్ కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

‘2018 నుండి అభిషేక్ నైట్ రైడర్స్ సెటప్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు, మైదానంలో మరియు వెలుపల మా ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్నాడు. ఆటపై అతని అవగాహన, ఆటగాళ్లతో అతని సంబంధం మా వృద్ధికి కీలకం. అతను ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం, KKRను దాని తదుపరి అధ్యాయానికి నడిపించడం చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాము.’ అని KKR CEO వెంకీ మైసూర్ ఒక ఫ్రాంచైజ్ ప్రకటనలో తెలిపారు.

IND vs SA : గౌహ‌తి టెస్టు మ్యాచ్‌లో కొత్త సంప్రదాయం..! ముందు టీ, ఆ త‌రువాతే లంచ్..