Actor Vishnu Vishal Jwala Gutta blessed with baby girl
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, తమిళ నటుడు విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. నేడు (ఏప్రిల్ 22)న తమ నాలుగో వివాహా వార్షికోత్సవం అని, ఈ రోజే దేవుడు మాకు గిఫ్ట్‌గా పాపను ఇచ్చాడన్నాడు.
‘మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈరోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. ఇదే రోజున మేము ఆ భగవంతుడి నుండి ఈ బహుమతిని అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి.’ అంటూ విష్ణు విశాల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీన్ని చూసిన అభిమానులు, నెటిజన్లు జ్వాలా, విశాల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
LED Stumps : ఐపీఎల్‌లో ఉపయోగించే LED స్టంప్స్ ధర ఎంతో తెలుసా? కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
2005 లో బ్మాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను జ్వాలా గుత్తా వివాహం చేసుకుంది. 2011లో కొన్ని కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. మరోవైపు విష్ణు విశాళ్ కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్‌ను 2010లో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. 2018లో వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. విష్ణు, రజనీ దంపతులకు ఆర్యన్ అనే కొడుకు ఉన్నాడు. 2021లో ఏప్రిల్ 22న విష్ణు, జ్వాలాలు వివాహం చేసుకున్నారు. ఆర్యన్ ప్రస్తుతం విష్ణు వద్దే ఉన్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. విష్ణు విశాల్ ఇరండు వానం, మోహన్దాస్, ఆర్యన్ చిత్రాలలో నటిస్తున్నారు.