SRH vs MI : ఉప్పల్‌లో ముంబైతో సన్‌రైజర్స్ మ్యాచ్.. ఓడిపోయినా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్..!
ఉప్పల్ వేదికగా బుధవారం సన్‌రైజర్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆ జట్టు 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -1.217గా ఉంది.
ఇక ముంబైతో రివేంట్ ఫైట్‌కు సిద్దమైంది. బుధవారం (ఏప్రిల్ 23) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై, సన్‌రైజర్స్ జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.
Rajastan royals : ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్..
తనకు అచ్చొచ్చిన హోం గ్రౌండ్‌లో ముంబైని మట్టి కరిపించాలని ఆరాటపడుతోంది. ఇంకోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోష్‌లో ఉన్న ముంబై అదే జోరును కొనసాగించాలని కోరుకుంటుంది. అటు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టు మంచి ఉత్సాహంతో ఉంది.
ఉప్పల్ మైదానం బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడం, ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయంగానే కనిపిస్తోంది.
సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..
పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ మరో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి. అప్పుడు సన్‌రైజర్స్ 18 పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
అలా కాకుండా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడినా 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉంటాయి. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఉంది. కాకపోతే మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం ఇంటి ముఖం పట్టాల్సిందే.