Rajastan royals : ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్..
ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.633గా ఉంది.
పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ సమీకరణం సంక్లిష్టంగా ఉంది. ఇక నుంచి ఆడనున్న అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా గానీ ఆ జట్టు ఖచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందనే గ్యారెంటీ లేదు. మిగిలిన సమీకరణాలు కలిసి రావాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ గురువారం (ఏప్రిల్ 24న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌కు ముందు రాజస్థాన్‌కు భారీ షాక్ తగిలింది.
కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడు పక్కటెముల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకునేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడడని, జట్టుతో పాటు అతడు బెంగళూరు వెళ్లలేదని, జైపూర్‌లోనే ఉండిపోయాడని రాజస్థాన్ ఓ ప్రకటనలో తెలిపింది.
KKR vs GT : కేకేఆర్ కెప్టెన్ రహానే కామెంట్స్.. ఈ సీజన్‌లో మేం ఓడిపోవడానికి కారణం అదే..
సంజూ శాంసన్ దూరం కావడంతో అతడి స్థానంలో రియాన్ పరాగ్ ఆర్ఆర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీతో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో సంజూ పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ తరువాత లక్నో మ్యాచ్‌లో అతడు ఆడలేదు. ఇప్పుడు ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు.