Shubman Gill : ‘నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్..?’ బ్రాడ్ కాస్టర్ ప్రశ్నకు సిగ్గుపడ్డ శుభ్‌మన్ గిల్..
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అనే ప్రశ్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ఎదురైంది.

Courtesy BCCI
టీమ్ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. భారత జట్టు భవిష్యత్ కెప్టెన్ అంటూ మాజీలు ఇప్పటికే అతడిని తెగపొగిడేస్తుంటారు. ఇక అతడికి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ ఆటగాడు పలువురితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు సైతం వస్తూనే ఉంటాయి.
దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. వీటిపై అటు సారాగానీ, ఇటు గిల్ గానీ ఇంత వరకు స్పందించలేదు. ఇక తాజాగా సారాతో అతడికి బ్రేకప్ అయిందని, నటి అవనీత్ కౌర్ తో అతడు డేటింగ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
KKR vs GT : మేం సరిగ్గా ఆడకున్నా గెలిచాం.. కంట్రోల్ చేసుకోలేకపోయా.. గిల్
సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గిల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. బ్రాడ్‌కాస్టర్ డానీ మోరిసన్ మాట్లాడుతూ.. నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని గిల్‌ను ప్రశ్నించాడు.
Danny Morrison – You’re looking good, wedding bells around the corner? Getting married soon?
Shubman Gill – No, nothing like that. pic.twitter.com/2wtfF2HmN0
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2025
దీనికి గిల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. లేదు.. ఇప్పటికైతే అలాంటిది ఏమీ లేదు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. దీంతో అతడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని అర్థమవుతోంది.
KKR vs GT : కేకేఆర్ కెప్టెన్ రహానే కామెంట్స్.. ఈ సీజన్‌లో మేం ఓడిపోవడానికి కారణం అదే..
ఇక ఈ మ్యాచ్‌లో గిల్ చక్కని ప్రదర్శన చేశాడు. 55 బంతులు ఎదుర్కొన అతడు 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు సాయి సుదర్శన్ (52), జోస్ బట్లర్ (41 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.