LED Stumps : ఐపీఎల్‌లో ఉప‌యోగించే LED స్టంప్స్ ధ‌ర ఎంతో తెలుసా? క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే..

ర‌నౌట్లు, స్టంపింగ్ వంటి విష‌యాల్లో ఎల్ఈడీ స్టంప్స్‌, బెయిల్స్‌ అంపైర్లకు ఎంత‌గానో సాయప‌డుతుంటాయి.

LED Stumps : ఐపీఎల్‌లో ఉప‌యోగించే LED స్టంప్స్ ధ‌ర ఎంతో తెలుసా? క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే..

Why are IPL stumps so expensive Here is the reason

Updated On : April 22, 2025 / 11:02 AM IST

ర‌నౌట్లు, స్టంపింగ్ వంటి విష‌యాల్లో ఎల్ఈడీ స్టంప్స్‌, బెయిల్స్‌ అంపైర్లకు ఎంత‌గానో సాయప‌డుతుంటాయి. మామూలు స్టంప్స్ వ‌ల్ల గ‌తంలో కొన్ని సంద‌ర్భాల్లో థ‌ర్డ్ అంపైర్ త‌న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించ‌డంలో జాప్యం జ‌రిగేది. అయితే.. ఎల్ఈడీ స్టంప్స్‌కు బంతి తాక‌గానే లైట్లు వెలుగుతాయి. బెయిల్స్ కింద‌ప‌డ్డ విష‌యం కూడా ఎంతో సులువుగా తెలుస్తోంది. దీంతో ర‌నౌట్లు స్టంపింగ్ నిర్ణ‌యాల్లో ఇవి ఖ‌చ్చిత‌త్వాన్ని పెంచుతున్నాయి. అందుక‌నే ఐపీఎల్‌లో 2016 నుంచి ఎల్ఈడీ స్టంప్స్‌ను వినియోగిస్తున్నారు.

ఈ స్టంప్స్ ఎలా పని చేస్తాయి?

బెయిల్స్‌లోనే ఈ స్టంప్స్ పని తీరు అంతా ఆధార‌ప‌డి ఉంటుంది. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి. ఓ మైక్రోప్రాసెసర్ ఉంటుంది. స్టంప్స్ తో కనెక్షన్ ఉన్నంత వరకు కూడా స్టంప్స్, బెయిల్స్ కు ఉన్న ఎల్ఈడీ లైట్స్‌ వెలగకుండా ఉంటాయి.

SRH vs MI : ఉప్పల్‌లో ముంబైతో స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్.. ఓడిపోయినా హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్‌..!

Courtesy BCCI

సూక్ష్మమైన మైక్రోప్రాసెసర్‌ బెయిల్స్‌, స్టంప్స్‌ మధ్య కదలికలను సెకన్‌లో 1000వ వంతులో గుర్తిస్తుంది. ఏదైనా తగిలి (బాల్) సర్క్యూట్ బ్రేక్ అయితే వెంటనే లైట్స్‌ వెలుగుతాయి. కొన్ని మోడ‌ల్స్‌లో చిన్న చిన్న కెమెరాల‌ను వినియోగిస్తారు.

Rajastan royals : ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు భారీ షాక్‌..

వీటిని ప్ర‌ధానంగా జింగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ వంటి కంపెనీలు త‌యారు చేస్తున్నాయి. ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్‌, ఐపీఎల్ వంటి ప్ర‌ధాన టోర్నీల్లో ఎక్కువ‌గా వినియోగిస్తారు.

ధ‌ర ఎంత‌..?
ఎల్ఈడీ స్టంప్స్ ధ‌ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఖ‌చ్చితమైన ధ‌ర తెలియ‌న‌ప్ప‌టికి బెయిల్స్‌తో పాటు స్టంప్‌ల ధ‌ర 40 నుంచి 50 వేల డాల‌ర్లు ఉంటుంది. అంటే భార‌త క‌రెన్సీలో రూ.30 నుంచి రూ.40ల‌క్ష‌లు అని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. వీటిలో ఉపయోగించిన మెటీరియల్‌, టెక్నాలజీ, అత్యధిక వేగంతో వచ్చిన బంతి తగిలినా తట్టుకొనే సామర్థ్యం ఆధారంగా వీటి ధ‌ర ఉంటుంది.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి