అడిలైడ్ వన్డే : కోహ్లీ, ధోని ఆదుకుంటారా?

కీలక మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ?

  • Published By: madhu ,Published On : January 15, 2019 / 09:58 AM IST
అడిలైడ్ వన్డే : కోహ్లీ, ధోని ఆదుకుంటారా?

Updated On : January 15, 2019 / 9:58 AM IST

కీలక మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ?

అడిలైడ్ : కీలక మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ? అని భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. సంక్రాంతి పండుగ రోజు క్రీడాభిమానులు టీవీలకు అతుక్కపోయారు. రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. 33 ఓవర్లలోనే 3 ప్రధాన వికెట్లు కోల్పోయేసరికి కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే..కోహ్లీ ఉన్నాడుగా…మ్యాజిక్ చేస్తాడనే ధీమాగా పలువురున్నారు. 

299 పరుగుల టార్గెట్…
రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఎదుట 299 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల కోల్పోయి 298 రన్స్ చేసింది. ఇందులో షాన్ మార్ష్ సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత ఓపెనర్లు గట్టిగానే బ్యాట్‌తో సమాధానం చెప్పారు. శర్మ, ధావన్‌లు ఫోర్లతో అలరించారు. తొలివికెట్‌కి 47 పరుగులు చేశారు. పంచి జోరు మీదున్న ధావన్ (28 బంతుల్లో 32, 5 ఫోర్లు) చేసి అవుట్ అయ్యాడు. అనంతరం శర్మకు కోహ్లీ జత కలిశాడు.

హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న శర్మ (52 బంతుల్లో 43, 2 ఫోర్లు, 2 సిక్స్) పెవిలియన్ చేరాడు. కోహ్లీ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. ధోని 6 , కోహ్లీ 74 ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 35 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన భారత్ 187 పరుగులు చేసింది. మరి ధోని.. కోహ్లీలు ధాటిగా ఆడి భారత్‌ని విజయతీరాలకు చేరుస్తారా ? లేదా ? అనేది చూడాలి.