×
Ad

AFG vs BAN : 7, 3, 7, 6, 0, 2, 4, 5, 9 ఇది ఫోన్ నంబ‌ర్ కాదండి బాబు.. బంగ్లా బ్యాట‌ర్ల క‌ష్టార్జితం..

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో అఫ్గానిస్తాన్ 200 ప‌రుగుల తేడాతో (AFG vs BAN) భారీ విజ‌యాన్ని సాధించింది.

AFG vs BAN Afghanistan won by 200 runs against Bangladesh in 3rd ODI

AFG vs BAN : బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ (3-0)కు గురైన అఫ్గానిస్తాన్.. వ‌న్డేల్లో ప్ర‌తీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను 3-0తో వైట్ వాష్ చేసింది. అబుదాబి వేదిక‌గా మంగళ‌వారం రాత్రి జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డేలో అఫ్గానిస్తాన్ (AFG vs BAN) 200 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 293 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో ఇబ్రహీం జద్రాన్ (95 111 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు.

BCCI : ఆసీస్‌తో సిరీస్ త‌రువాత‌.. రోహిత్, కోహ్లీ వ‌న్డే భ‌విత‌వ్యంపై స్పందించిన బీసీసీఐ..

మ‌హ్మ‌ద్ న‌బీ (62 నాటౌట్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌గా రహ్మానుల్లా గుర్బాజ్ (42) రాణించాడు. బంగ్లా బౌల‌ర్ల‌లో సైఫ్ హసన్ మూడు వికెట్లు తీశాడు. హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం లు చెరో రెండు వికెట్లు సాధించారు. మెహ‌ది హ‌స‌న్ మిరాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం 294 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ 27.1 ఓవ‌ర్ల‌లో 97 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ సైఫ్ హసన్ (43) ఒక్క‌డే రాణించాడు. మిగిలిన వారు ఘోరంగా విఫ‌లం అయ్యారు. ఎంత‌లా అంటే సైఫ్ మిన‌హా మ‌రే బ్యాట‌ర్ (7, 3, 7, 6, 0, 2, 4, 5 9 ) కూడా రెండు అంకెల స్కోరును సాధించలేదు.