Afghanistan pacer Naveen ul Haq ruled out of T20 World Cup 2026 Reports
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి ముందు అఫ్గానిస్తాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఈ మెగాటోర్నీ నుంచి తప్పుకున్నాడు. గత కొంతకాలంగా అతడు భుజం నొప్పితో బాధడుతున్నాడు. ఈ నెలాఖరున గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు టీ20 ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు.
వాస్తవానికి నవీన్ చాలాకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అయితే.. అఫ్గాన్ సెలక్టర్లు మాత్రం మెగా టోర్నీ సమయానికి అతడు కోలుకుంటాడు అని భావించి ఎంపిక చేశారు. అయితే.. గాయం తీవ్రత పెరగడంతో నవీన్ వెస్టీండీతో టీ20 సిరీస్‌తో పాటు మెగా టోర్నీకి దూరం అవుతున్నాడు.
David Warner : శతకంతో చెలరేగిన డేవిడ్ వార్నర్.. బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు..
శస్త్రచికిత్స అనంతరం అతడు కోలుకుని మైదానంలో బరిలోకి దిగేందుకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడు దాదాపు ఏడాదిగా జాతీయ జట్టు తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
కాగా.. నవీన్ ఉల్ హక్ స్థానంలో అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇంకా ఎవరిని ఎంపి చేయలేదు. రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ, అల్లా గజన్ఫర్ లేదా ఇజాజ్ అహ్మద్‌జాయ్‌లలో ఎవరో ఒకరు జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026కు అఫ్గాన్ జట్టు ఇదే..
రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సెడిఖుల్లా అటల్, ఫజల్‌హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా, రమ్‌మానులీ, రమ్‌మతుల్లా, ఉమర్‌జాయి, జద్రాన్.
రిజర్వ్ ఆటగాళ్లు.. అల్లా ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.