Virat Kohli : కోహ్లీ వ‌న్డే ర్యాంకింగ్ విష‌యంలో ఐసీసీ బిగ్ మిస్టేక్‌.. 722 రోజులు.. ఫ్యాన్స్ చూడ‌బ‌ట్టి స‌రిపోయింది గానీ.. లేదంటేనా?

వ‌న్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ (Virat Kohli) ఎన్ని రోజులు అగ్ర‌స్థానంలో ఉన్నాడు అనే విష‌యంలో ఐసీసీ ఓ త‌ప్పు చేసింది.

Virat Kohli : కోహ్లీ వ‌న్డే ర్యాంకింగ్ విష‌యంలో ఐసీసీ బిగ్ మిస్టేక్‌.. 722 రోజులు.. ఫ్యాన్స్ చూడ‌బ‌ట్టి స‌రిపోయింది గానీ.. లేదంటేనా?

ICC Massive Blunder On Virat Kohli No1 ODI Ranking

Updated On : January 16, 2026 / 2:46 PM IST
  • కోహ్లీ విష‌యంలో ఐసీసీ మిస్టేక్‌
  • వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో ఎన్ని రోజులు ఉన్నాడ‌నే విష‌యంలో
  • తొలుత 825 రోజులు అని పోస్ట్

Virat Kohli : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన ఈ ర‌న్ మెషీన్ వ‌న్డేల్లో అద‌ర‌గొడుతున్నాడు. గ‌త ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 50 లేదా అంత‌కంటే ఎక్కువ ప‌రుగుల‌ను సాధించాడు. ఈ క్ర‌మంలోనే అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. నాలుగేళ్ల త‌రువాత కోహ్లీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ 1 స్థానానికి చేర‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

అయితే.. కోహ్లీ నంబ‌ర్ 1 ర్యాంక్ విష‌యంలో ఐసీసీ బిగ్ మిస్టేక్ చేసింది. వ‌న్డే ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ ఎన్ని రోజులు నంబ‌ర్‌-1 స్థానంలో ఉన్నాడు అనే విష‌యాన్ని లెక్కించ‌డంతో ఐసీసీ త‌ప్పు చేసింది. తొలుత 825 రోజులు అని చెప్పింది. ఈ క్ర‌మంలో అత‌డు వ‌న్డే ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్ విభాగంలో టాప్‌-1లో అత్య‌ధిక రోజులు ఉన్న ప్లేయ‌ర్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచాడ‌ని తెలిపింది.

RCB : పార్టీలో ఆర్‌సీబీ ప్లేయ‌ర్ల జోష్ చూశారా?

వెంట‌నే ఐసీసీ చేసిన త‌ప్పును అభిమానులు క‌నిపెట్టేశారు. వాస్త‌వానికి కోహ్లీ 1547 రోజులు ఐసీసీ వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఈ ఈ విష‌యాన్ని గ‌తంలో ఐసీసీ ప్ర‌క‌టించింది కూడా. ఇక అభిమానులు కూడా ఇదే విష‌యాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు.

IND vs NZ : ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్..

ఇక ఐసీసీ తాము చేసిన త‌ప్పును స‌రిదిద్దుకుంది. పాత పోస్ట్‌ను డిలీట్ చేసింది. 1547 రోజులు కోహ్లీ నంబ‌ర్ 1 వ‌న్డే బ్యాట‌ర్‌గా కొన‌సాగాడని పోస్ట్ చేసింది.

‘టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ తొలిసారి అక్టోబర్ 2013లో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు అత‌డు మొత్తం 1547 రోజులు నంబర్-1 స్థానంలో ఉన్నాడు. ఏ టీమ్ఇండియా ప్లేయ‌ర్ కూడా ఇన్ని రోజులు అగ్ర‌స్థానంలో లేడు. ఇక ఓవ‌రాల్ చూస్తే..విండీస్ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్ (2306 రోజులు) తొలి స్థానంలో ఉండగా, కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.’ అని ఐసీసీ వివ‌ర‌ణ ఇచ్చింది.