Rashid Khan Marriage: ఘనంగా అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం.. వీడియోలు వైరల్.. ఎవరెవరు వచ్చారంటే?

రషీద్ పెళ్లికి అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న అతని సహచర క్రికెటర్లందరూ హాజరయ్యారు. జట్టు వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ పెళ్లిలో ..

Rashid Khan Marriage

Rashid Khan Wedding: అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహ బందంలోకి అడుగు పెట్టాడు. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ పెళ్లి జరిగింది. గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు అఫ్గానిస్థాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. రషీద్ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రషీద్ తో పాటు అతడి ముగ్గురు సోదరుల వివాహం కూడా ఒకే సమయానికి పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం రషీద్ తన ఇంటర్వ్యూలో అఫ్గానిస్థాన్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే, 2024లో అఫ్గానిస్థాన్ తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు చేరుకోవడం గమనార్హం.

Also Read : T20 World Cup 2024: టీ20 వరల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ శుభారంభం.. భారత్ జట్టుకు సవాల్.. ఎవరు గెలుస్తారో?

రషీద్ పెళ్లికి అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న అతని సహచర క్రికెటర్లందరూ హాజరయ్యారు. జట్టు వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ పెళ్లిలో కనిపించాడు. ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, రహ్మత్ షా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లతో సహా ఇతర అఫ్గాన్ క్రికెటర్లు రషీద్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.