T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ శుభారంభం.. భారత్ జట్టుకు సవాల్.. ఎవరు గెలుస్తారో?
భారత్ జట్టు ఇవాళ తన టీ20 వరల్డ్ కప్ 2024 ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో ఇవాళ సాయంత్రం ఆడనుంది.

Dubai International Cricket Stadium
ICC Womens T20 World Cup 2024: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీ యూఏఈలో ప్రారంభమైంది. గురువారం గ్రూప్ -బిలో బంగ్లాదేశ్ జట్టు స్కాట్లాండ్ పై విజయం సాధిచంగా.. గ్రూప్ – ఏ విభాగంలో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. గ్రూప్ -ఏ విభాగంలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. పాకిస్థాన్ తొలి మ్యాచ్ లోనే అదరగొట్టింది. శ్రీలంక జట్టును 31 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు కేవలం తొమ్మిది ఓవర్లకే 85 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఆల్ రౌండ్ ప్రదర్శన చేశారు. 30 పరుగులు చేయడమేకాక రెండు వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైంది.
Also Read : Hardik Pandya : పాండ్యాకు రూ.18 కోట్లా? అందుకు అతడు అర్హుడేనా? రూ.14 కోట్లు దండగేనా?
భారత్ జట్టు ఇవాళ తన టీ20 వరల్డ్ కప్ 2024 ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో ఇవాళ సాయంత్రం ఆడనుంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య 13 టీ20 మ్యాచ్ లు జరిగాయి. అందులో నాలుగు మ్యాచ్ లలో నెగ్గిన భారత్ జట్టు.. తొమ్మిది సార్లు ఓడిపోయింది. న్యూజిలాండ్ బారత్ కు ధీటైన జట్టే. ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రపంచ మేటి ఆల్ రౌండర్లలో ఒకరైన అమేలియా కెర్ కివీస్ జట్టుకు అతిపెద్ద బలం. హర్మన్ ప్రీత్ సారధ్యంలోని భారత్ జట్టు కూడా మంచి ఫామ్ లో ఉంది. వార్మప్ మ్యాచ్ లు రెండింట్లోనూ భారత్ జట్టు విజయం సాధించింది. బౌలర్లు రాణిస్తున్నా.. బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Also Read : Rohit Sharma : విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలపై రోహిత్ శర్మ కామెంట్స్.. టెస్టుల్లో వారిద్దరి వల్లే..
గ్రూప్ A: ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక.
గ్రూప్ B: బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్.
భారత జట్టు మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా..
అక్టోబర్ 4 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (రాత్రి 7.30గంటలకు)
అక్టోబర్ 6 : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (సాయంత్రం 3.30 గంటలకు)
అక్టోబర్ 9 : ఇండియా వర్సెస్ శ్రీలంక (రాత్రి 7.30గంటలకు)
అక్టోబర్ 13 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (రాత్రి 7.30గంటలకు)
భారత జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, ఆశ శోభన, శ్రేయాంక పాటిల్, రాధ యాదవ్, రేణుక సింగ్.
భారత్ మ్యాచ్ లు ఎక్కడ చూడాలి : మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ లు భారత్ లోని స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రసారం అవుతాయి. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్ సైట్ లోనూ మ్యాచ్ లను చూడొచ్చు.