Rohit Sharma : విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలపై రోహిత్ శర్మ కామెంట్స్.. టెస్టుల్లో వారిద్దరి వల్లే..
రోహిత్ తన టెస్టు క్రికెట్ కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్‌లో ఆడేవాడు అన్న సంగతి తెలిసిందే.

Virat Kohli and Ravi Shastri ensured my 2nd birth in Test cricket Rohit Sharma
Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేదు. టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆటగాడు టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చే రోహిత్ ఎంతటి విధ్వంసర ఆటగాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక టెస్టుల్లోనూ అదే ధోరణితో రోహిత్ ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచులోనూ వేగంగా పరుగులు రాబట్టాడు.
కాగా.. రోహిత్ తన టెస్టు క్రికెట్ కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్‌లో ఆడేవాడు అన్న సంగతి తెలిసిందే. అయితే.. మిడిల్ ఆర్డర్‌లో హిట్‌మ్యాన్ అంతగా సక్సెస్ కాలేకపోయాడు. జట్టులో తన స్థానం ఎప్పుడూ ప్రశ్నార్థకరంగానే ఉండేది. టెస్టుల్లోనూ ఎప్పుడైతే ఓపెనర్‌గా రావడం మొదలెట్టాడో అప్పటి నుంచే అతడి దశ తిరిగిపోయింది. నిలకడగా రాణిస్తూ టెస్టుల్లోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు.
Team India : ముంబైకి రోహిత్ శర్మ, లండన్‌కు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ!
ఓ యూట్యూబ్ ఛానల్‌లో కామెంటేటర్ జతీన్ సప్రుతో రోహిత్ తన టెస్టు కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన రవిశాస్త్రి, విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రోహిత్ చెప్పాడు. తనను టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోట్ చేయడం అంత తేలికైన నిర్ణయం కాదన్నాడు. అయినప్పటికి తనపై వారు నమ్మకం ఉంచి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని చెప్పారు.
ఆ మ్యాచులో తాను మొదటి బంతికే డకౌట్ అయినట్లుగా రోహిత్ గుర్తు చేసుకున్నాడు. దీంతో ఓపెనర్‌గా తనకు అవకాశం రాదని, ఐదు లేదా ఆరు లేదా లోయర్ ఆర్డర్ అనేది పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావించినట్లు రోహిత్ చెప్పాడు.
ICC Test rankings : అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10లోకి విరాట్ కోహ్లీ..
తాను ఎలా ఆడాలని అనుకుంటున్న విషయాన్ని కోహ్లీ, రవిశాస్త్రిలకు చెప్పానన్నాడు. నా స్ట్రైల్‌లోనే ఆడుతా, వికెట్ కాపాడుకోవడం కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకోను అని వారితో అన్నాను. ఇందుకు వారు అంగీకరించి నాకు స్వేచ్ఛ ఇచ్చారు. అని రోహిత్ అన్నాడు.
2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోహిత్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. 2018 వరకు హిట్‌మ్యాన్ కేవలం 27 టెస్టులు మాత్రమే ఆడాడు. 1585 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో ఓపెనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ 34 టెస్టుల్లో తొమ్మిది సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలతో సహా 2594 పరుగులు చేశాడు. ఇది టెస్టుల్లో అతడి స్థానాన్ని సుస్థిరం చేసింది.
ఓవరాల్‌గా ఇప్పటి వరకు రోహిత్ శర్మ 60 టెస్టులు ఆడాడు 4148 పరుగులు చేశాడు.ఇందులో 12 సెంచరీలు, 17 అర్థశతకాలు ఉన్నాయి.
While @ImRo45 Rohit’s legacy in test cricket is being discussed – Here’s a little story of his comeback into test cricket .. Also a sneak peek into how @RaviShastriOfc and @imVkohli planned India’s ascendancy in tests. pic.twitter.com/LO0jVtqP7O
— Jatin Sapru (@jatinsapru) October 1, 2024