Team India : ముంబైకి రోహిత్ శర్మ, లండన్‌కు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ!
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు.

Team India seniors to enjoy short 2 weeks of break before IND vs NZ Tests
Team India : బంగ్లాదేశ్ పై రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత్ సిద్ధమవుతోంది. అయితే.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే.. ఇందులో టెస్టు జట్టులో ఆడిన ఆటగాళ్లు ఎవరూ లేరు.
టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బంగ్లాదేశ్‌తో టెస్టులో ఆడిని యశస్వి జైస్వాల్, జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ తదితరులకు టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. దీంతో వీరంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.
ICC Test rankings : అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10లోకి విరాట్ కోహ్లీ..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ముంబైకి చేరుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ లండన్‌కు పయనం అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తోనే మళ్లీ వీరంతా గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు. కివీస్‌పై క్లీన్‌స్వీప్ చేస్తే భారత్.. ఆసీస్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌తో ఎలాంటి సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ లో చోటు దక్కించుకోనుంది.
ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో టీ20 మ్యాచులు జరగనున్నాయి.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
CAPTAIN ROHIT IS BACK IN MUMBAI…!!!! 🔥
– Hitman in his Lamborghini, heading back home after a great Test series victory. pic.twitter.com/1wKCxrzcm9
— Johns. (@CricCrazyJohns) October 2, 2024
Virat Kohli with fans at the airport.
– The favourite for all, King. ⭐ pic.twitter.com/h89QA6dkUS
— Johns. (@CricCrazyJohns) October 2, 2024