ICC Test rankings : అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10లోకి విరాట్ కోహ్లీ..
బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో అదరగొట్టారు భారత ప్లేయర్లు.

Jasprit Bumrah
ICC Test rankings : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో అదరగొట్టారు భారత ప్లేయర్లు. దీంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తమ స్థానాలను మెరుగుపరచుకోగా బౌలింగ్‌లో బుమ్రా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే.. అశ్విన్ రెండో స్థానానికి పడిపోవడం గమనార్హం.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మ్యాచులో ఆరు వికెట్లతో బుమ్రా చెలరేగాడు. దీంతో అశ్విన్‌ను అధిగమించి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. వీరిద్దరి మధ్య కేవలం ఒక రేటింగ్ పాయింట్ మాత్రమే తేడా ఉంది. రవీంద్ర జడేజా 6వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
బౌలర్ల టెస్టు ర్యాంకింగ్స్..
జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 870 రేటింగ్ పాయింట్లు
రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 869 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 847 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 820 రేటింగ్ పాయింట్లు
కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 820 రేటింగ్ పాయింట్లు
ఇక రెండో టెస్టులో రాణించిన విరాట్ కోహ్లీ మళ్లీ టాప్-10లోకి దూసుకువచ్చాడు. ఆరు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తమ స్థానాలను దిగజారీ వరుసగా 9, 15, 16 స్థానాలకు పడిపోయారు.
బ్యాటర్ల టెస్టు ర్యాంకింగ్స్..
జో రూట్ (ఇంగ్లాండ్) – 899 రేటింగ్ పాయింట్లు
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 829 రేటింగ్ పాయింట్లు
యశస్వి జైస్వాల్ (భారత్) – 792 రేటింగ్ పాయింట్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 757 రేటింగ్ పాయింట్లు
ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) – 728 రేటింగ్ పాయింట్లు
Rohit Sharma : బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్