Hardik Pandya : పాండ్యాకు రూ.18 కోట్లా? అందుకు అతడు అర్హుడేనా? రూ.14 కోట్లు దండగేనా?
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది.

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. నవంబర్‌లో మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 31లోపు అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే బీసీసీఐ తెలిపింది. దీంతో ఏ ప్రాంఛైజీ ఎవరెవరిని అట్టి పెట్టుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను రిటైన్ చేసుకోనుందని టాక్.
వీరిలో ఇద్దరు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.18 కోట్లు, మరో ఇద్దరికి రూ.14 కోట్లు, ఒకరిని రూ.11కోట్లకు రిటైన్ చేసుకోవచ్చునని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను రూ.18 కోట్లకు అట్టిపెట్టుకునేందుకు అర్హుడా కాదా అనే దానిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ స్పందించాడు.
Mohammed Shami : అవన్నీ ఎవరు చెప్పారు మీకు ? షమీ మండిపాటు
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు, ఆ తరువాత జరిగిన పరిణామాలను రోహిత్ శర్మ ఓ భ్రమ అని అనుకోవాలి. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే.. సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకోవాలి. ఇక హార్దిక్ పాండ్యాకు రూ.14 కోట్లు చాలు. అతడి ఫిట్‌నెస్, ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే అంతకన్నా తక్కువ మొత్తానికే అతడిని కొనసాగించాలి అని టామ్ మూడీ అన్నాడు.
ఏ విధంగా చూసినా హార్దిక్ పాండ్యా రూ.18 కోట్లకు అర్హుడు కాదు. అన్ని కోట్లు పలికే ఆటగాడు ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్ అయి ఉండాలి. అయితే.. పాండ్యా గత సీజన్‌లో బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డాడు. అంతేకాదు.. కెప్టెన్‌గానూ విఫలం అయ్యాడు. ఇక ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే వాళ్లలో యువ ఆటగాడు తిలక్ వర్మ ఖచ్చితంగా ఉంటాడు అని మూడీ చెప్పాడు.
ఐదు సార్లు జట్టుకు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాకు ముంబై నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అయితే.. ఈ సీజన్‌లో ముంబై ఘోరంగా విఫలమైంది. మూడు మ్యాచుల్లోనే విజయాలను సొంతం చేసుకుంది. ఇక రోహిత్ శర్మ ముంబైని వీడి మెగా వేలంలో అడుగుపెట్టనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 31లోపు దీనిపై ఓ స్పష్టత రానుంది.