Mohammed Shami : అవన్నీ ఎవరు చెప్పారు మీకు ? షమీ మండిపాటు
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

Shami Breaks Silence On Reports Claiming India Pacer Is Out Of Border Gavaskar Trophy
Mohammed Shami : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికే జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని భావించినా అది జరగలేదు. ఇక రంజీ ట్రోఫీలో సత్తా చాటి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నాటికి సిధ్ధం కావాలనే లక్ష్యంతో షమీ శ్రమిస్తున్నాడు.
అయితే.. అతడి మోకాలిలో సమస్య మళ్లీ తిరిగబెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతడు ఆసీస్ పర్యటనకు దూరం అయ్యాడని సదరు వార్తల సారాంశం. వీటిపై షమీ స్పందించాడు. అవన్నీ రూమర్లు అని కొట్టిపారేశాడు. ఇవన్నీ రూమర్లే. రికవరీ అయ్యేందుకు ఎంతో కష్టపడుతున్నట్లు షమీ చెప్పారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లుగా తాను గానీ, బీసీసీఐ గానీ చెప్పలేదన్నాడు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలను నమ్మవద్దని ప్రజలకు సోషల్ మీడియా వేదికగా షమీ విజ్ఞప్తి చేశాడు.
ఇదిలా ఉంటే.. షమీ వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడి ఫిట్‌నెస్‌ను బీసీసీఐ పర్యవేక్షిస్తోందని, ఈ నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఆడాలనే లక్ష్యంతో అతడు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తెలిపింది. ఒకవేళ అతడు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఫిట్‌గా లేకపోతే నవంబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. వరుసగా రెండు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోపీని సొంతం చేసుకున్న భారత్ ముచ్చటగా మూడో సారి దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
Team India : ముంబైకి రోహిత్ శర్మ, లండన్‌కు వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ!