ODI World Cup 2023 : ఆరంభ వేడుక‌లు..! అప్ప‌ట్లో రిక్షాల‌పై ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్లు.. ఇప్పుడెలా వ‌స్తారో..?

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పుష్క‌ర కాలం త‌రువాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు దేశం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

Captains entry in rickshaws in world cup 2011

ODI World Cup : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పుష్క‌ర కాలం త‌రువాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు దేశం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. 2011లో బంగ్లాదేశ్‌, శ్రీలంక‌తో క‌లిసి భార‌త్ ఆతిథ్యం ఇచ్చింది. 1987, 1996లో సైతం మ‌రో దేశంతో క‌లిసే నిర్వ‌హించింది. ఈ సారి మ‌రే దేశంతో పంచుకోకుండా ఆతిథ్యం ఇస్తుంది. ఈ క్ర‌మంలో ప్రారంభ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే అక్టోబ‌ర్ 4వ తేదీన అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మ‌నీని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వేడుక‌కు ఐసీసీ స‌భ్యుల‌తో పాటు అన్ని దేశాల క్రికెట్ బోర్డు పెద్ద‌ల‌ను ఆహ్వానించాల‌ని బావిస్తోంది. అంతేకాకుండా క‌ప్పు కోసం పోటీప‌డే 10 దేశాల కెప్టెన్లు కూడా ఈ వేడుక‌కు హాజ‌రు కానున్నారు. ఈ వేడుక‌కు ప్రారంభానికి ముందు ఈ కెప్టెన్లంత మీడియా స‌మావేశంలో పాల్గొన‌న‌నున్నారు.

CPL 2023 : అగో.. రెడ్ కార్డు వ‌చ్చింది.. నువ్వు బ‌య‌టికి పో.. పాపం సునీల్ న‌రైన్‌.. పొలార్డ్ ఇలా చేశావేంటి..?

గ‌త సారి అంటే 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ వేడుకలు బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా వేదిక‌గా నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో ఆ టోర్నీల్లో పాల్గొన్న కెప్టెన్లు అంత రిక్షాల్లో స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది చూడ‌డానికి ఎంతో ఆక‌ట్టుకుంది. మ‌రీ ఈ సారి కెప్టెన్లు ఎలా స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తారో అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 5న 2019 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఫైన‌లిస్టులు అయిన ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక టీమ్ఇండియా అక్టోబ‌ర్ 8న చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో మొద‌టి మ్యాచ్‌ ఆడ‌నుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య అక్టోబ‌ర్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

Neeraj Chopra: 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే మరో పని చేసిన నీరజ్.. మైదానంలో కాదు బయట..

ట్రెండింగ్ వార్తలు