Aiden Markram Comments after T20 series lost to India
SA vs IND : సొంత గడ్డపై భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఘోర పరాభవం చవిచూసింది. నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌లో 3-1 తేడాతో ఓడిపోయింది. జోహెన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ మాట్లాడాడు. సిరీస్ ఓటమిపై స్పందించాడు. మూడు విభాగాల్లోనూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్)లో పేలవ ప్రదర్శనే కారణం అని చెప్పాడు. ఈ ఓటమి భాదించిందని అన్నాడు.
ఇక నాలుగో టీ20 మ్యాచ్‌లో వైడ్‌ల రూపంలో 17 పరుగులు సమర్పించడం పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని భావించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. అన్ని విభాగాల్లో విఫలం కావడంతో ఓడిపోయామన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఒత్తిడి తీసుకువచ్చిందన్నాడు.
బంతులను నేరుగా స్టంప్స్ పైకి వేయాలన్నాడు. రెండు లేదా మూడు వైడ్లు వేస్తే ఓకే కానీ 15 ఫ్లస్ వైడ్స్ వేయడం సరైంది కాదన్నాడు. తమ ప్రణాళికలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు. జట్టు సరైన మార్గంలో నడవాల్సి ఉందని, 2026 టీ20 ప్రపంచకప్‌లోపు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. ఇక ఈ సిరీస్‌లో మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ ప్రదర్శనలు సానుకూలాంశలు అని మార్‌క్రమ్ చెప్పాడు.
ఇక నాలుగో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజూ శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు ) మెరుపు శతకాలతో చెలరేగారు. అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 135 పరుగుల తేడాతో గెలుపొందింది.
India Vs South Africa: అయ్యో.. సంజూ కొట్టిన సిక్స్‌కు కన్నీరు పెట్టుకున్న యువతి.. వీడియో వైరల్