Abu Dhabi T10 League : టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. మొద‌టి ఓవ‌ర్‌లోనే హ్యాట్రిక్.. 6 ప‌రుగులిచ్చి 5 వికెట్లు..

Akeal Hosein-Abu Dhabi T10 League : అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్(ఈసీఎస్‌) టీ10 క్రికెట్‌లో ప‌లు ప్ర‌పంచ రికార్డులు న‌మోదు అవుతున్నాయి.

Akeal Hosein hat trick in Abu Dhabi T10 League

అబుదాబి వేదిక‌గా జ‌రుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్(ఈసీఎస్‌) టీ10 క్రికెట్‌లో ప‌లు ప్ర‌పంచ రికార్డులు న‌మోదు అవుతున్నాయి. మొన్న కాటలున్యా జాగ్వార్ ఆట‌గాడు హ‌మ్జా స‌లీమ్‌దార్ కేవ‌లం 43 బంతుల్లో 14 ఫోర్లు, 22 సిక్స్ల‌రు బాది 193 చేసి ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ స్ట్రైకర్స్ త‌రుపున ఆడుతున్న వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

రెండు ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన అకేల్ హోసేన్ ఆరు ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ వికెట్లు తీయ‌డం విశేషం. క్వాలిఫ‌య‌ర్ 1లో భాగంగా న్యూయార్క్ స్ట్రైక‌ర్స్‌తో మొరిస్‌విల్లే సాంప్ ఆర్మీ త‌ల‌ప‌డింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ స్ట్రైక‌ర్స్ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 125 ప‌రుగులు చేసింది. అఫ్గానిస్థాన్ ఆటగాడు అయిన ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్ 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స‌ర్లు బాది 56 ప‌రుగులు చేసి జ‌ట్టు భారీ స్కోరు సాధించ‌డంలో సాయం చేశాడు.

India tour of South Africa : మూడేళ్ల న‌ష్టాలు ఒక్క సిరీస్‌తో దూరం..! మ‌రో మూడేళ్ల వ‌ర‌కు ఢోకా లేదు..!

అనంత‌రం 126 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన మొరిస్‌విల్లే సాంప్ కు అకేల్ హోసేన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అత‌డు త‌న మొద‌టి ఓవ‌ర్‌లో మూడో బంతికి ఆండ్రీస్ గౌస్‌(0)ను క్లీన్ చేశాడు. నాలుగో బంతికి విధ్వంస‌క‌ర వీరుడు డెవాల్డ్ బ్రెవిస్ (0) వికెట్‌ను ప‌డ‌గొట్టాడు. ఇక ఐదో బంతికి ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (0) ల‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌రువాత‌ త‌న రెండో ఓవ‌ర్‌లో ఫాఫ్ డుప్లెసిస్ (8 పరుగులు), నజీబుల్లా జద్రాన్ (4 పరుగులు) ల‌ను ఔట్ చేశాడు.

మొత్తంగా త‌న రెండు ఓవ‌ర్ల కోటాలో 6 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన అకేల్ హోసేన్ 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో ల‌క్ష్య ఛేద‌న‌లో మొరిస్‌విల్లే సాంప్ ఆర్మీ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 80 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో న్యూయార్క్ స్ట్రైకర్స్ 41 ప‌రుగుల తేడాతో గెలుపొంది ఫైన‌ల్‌కు దూసుకు వెళ్లింది.

కాగా.. అకేల్ హోసేన్ హ్యాట్రిక్ తీసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

AB De Villiers : కొడుకు వ‌ల్ల కంటిచూపు కోల్పోయా.. వాళ్లు చెప్ప‌డంతోనే రిటైర్మెంట్ .. ఏబీ డివిలియ‌ర్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ట్రెండింగ్ వార్తలు