Imane Khelif : ‘నేను అమ్మాయినే..’ స్వ‌ర్ణం గెలిచిన త‌రువాత అల్జీరియా బాక్స‌ర్ ఇమానె ఆవేద‌న‌..

పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియా బాక్స‌ర్ ఇమానె ఖెలిఫ్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకుంది.

Algerian boxer Imane Khelif wins gold at Paris Olympics

Algerian boxer Imane Khelif : పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియా బాక్స‌ర్ ఇమానె ఖెలిఫ్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకుంది. బాక్సింగ్ 66 కేజీల ఫైన‌ల్‌లో ఆమె చైనా బాక్స‌ర్ యాంగ్ లియూను ఓడించింది. స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అందుకున్న వెంట‌నే ఆమె నేను అమ్మాయినే అంటూ గ‌ట్టిగా అరిచి త‌న ఆవేద‌న‌ను అంద‌రి ముందూ వెళ్ల‌గ‌క్కేసింది. త‌న ఎనిమిదేళ్ల క‌ల నెర‌వేరిన‌ట్లుగా తెలిపింది.

నేను మ‌హిళను. నేను మ‌హిళ‌గానే పుట్టా.. అలాగే పెరిగాను. అన్ని క్వాలిఫికేష‌న్లు దాటుకుని ఇక్కడికి వ‌చ్చాను. గోల్డ్ మెడ‌ల్‌ను గెలిచాను. ఇప్పుడు నేనొక ఛాంపియ‌న్‌ను. భ‌విష్య‌త్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావని ఆశిస్తున్నాను. అంటూ ఖెలిఫ్ అంది.

Aman Sehrawat : అమ‌న్ కొద్దిలో త‌ప్పించుకున్నాడా..! లేదంటే వినేశ్ ఫోగ‌ట్‌లానే అన‌ర్హ‌త వేటు ప‌డేదా..! 10 గంట‌ల్లో 4.6 కేజీలు..

పురుషుల సంబంధించిన జ‌న్యుప‌ర‌మైన ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని మ‌హిళ‌ల పోటీల్లోకి ఎలా అనుమ‌తించారు అంటూ ఇమానె ఖెలిఫ్ పై ఇటీవ‌ల ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖులు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమెను పోటీల్లోకి అనుమ‌తించిన అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీపైనా విరుచుకుప‌డ్డారు. తాను అమ్మాయిని కాద‌నే ట్రోలింగ్‌తో ఇమానె ఖెలిఫ్ ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంది. అయిన‌ప్ప‌టికి ఆమె ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. గెలిచిన త‌రువాతనే వీటిపై అనంత‌రం ఆమె మాట్లాడింది.

అస‌లేం జ‌రిగిందంటే..?

అల్జీరియాలోని తియారెట్ చెందింది 25 ఏళ్ల ఇమానె ఖెలిఫ్. 2023లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ బాక్ఇసంగ్ ఛాంపియ‌న్ షిప్స్‌లో లింగం స‌మ‌స్య త‌లెత్తింది. ఆమెలో ఎక్స్‌, వై క్రోమోజోములు ఉన్నాయంటూ ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సింగ్ అసోసియేష‌న్ ఆమెను ప‌క్క‌న పెట్టింది. అయితే.. ఒపింక్స్‌లో నిబంధ‌న‌ల కార‌ణంగా ఆమెకు విశ్వక్రీడ‌ల్లో ఆడే అవ‌కాశం వ‌చ్చింది. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ను 46 సెక‌న్ల‌లోనే ముగించింది. ఆమె కొట్టిన పంచ్‌కు ఇటలీ క్రీడాకారిణి ఏంజెలా కెరాని విల‌విల‌లాడింది. బాధ‌తో ఆమె బౌట్ పూర్తి కాకుండానే వైదొలిగింది. దీంతో ఖెలిఫ్ అమ్మాయి కాదంటూ పెద్ద ఎత్తును ఆమె పై ట్రోలింగ్ మొద‌లైంది.

Neeraj Chopra – Nadeem : భారత్-పాక్‌ స్టార్లు.. మైదానంలో ప్ర‌త్య‌ర్థులు.. బయట దోస్తులు..

ట్రెండింగ్ వార్తలు