Ambati Rayudu: వైసీపీని వీడాక.. మరో ఆసక్తికర ట్వీట్ చేసిన అంబటి రాయుడు

ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధమూ..

Ambati Rayudu

వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను అంబటి రాయుడిని… జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు’ అని పేర్కొన్నారు.

కాగా, వారం రోజుల క్రితమే వైఎస్సార్సీపీలో చేరిన అంబటి రాయుడు నిన్న ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీని వీడుతున్నానని, కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అని ఆయన ట్వీట్ చేశారు.

గత నెల తేదీన వైఎస్సార్సీపీలో చేరారు అంబటి రాయుడు. ఏపీలోని తాడేపల్లి ఏపీ సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసులో ఆ పార్టీ చేరారు. సీఎం జగన్‌ ఆ సమయంలో అంబటికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారం రోజుల్లోనే ఆయన వైసీపీని వీడడంతో దీనిపై టీడీపీ నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

వైసీపీలో చేరినవారు వారం రోజులు కూడా ఆ పార్టీలో ఉండలేకపోతుండడానికి ఆ పార్టీలోని ప్రతికూల పరిస్థితులే కారణమని టీడీపీ ఆరోపణలు చేసింది. చివరకు అంబటి నాయుడు దీనిపై క్లారిటీ ఇచ్చేలా ట్వీట్ చేశారు.

కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ దంపతులు