Paris Olympics 2024 : కీలక సెమీస్‌ మ్యాచ్‌కు ముందు భార‌త హాకీ టీమ్‌కు షాక్‌.. కీల‌క ఆట‌గాడిపై నిషేదం..

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త హాకీ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

Amit Rohidas Handed One Match Ban

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త హాకీ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ప్రిక్వార్ట‌ర్స్‌లో బ్రిట‌న్ ను ఓడించి సెమీస్ కు చేరుకుంది. అయితే.. సెమీస్ చేరుకున్న ఆనందంలో ఉన్న భార‌త జ‌ట్టుకు గ‌ట్టి షాకిచ్చింది ఒలింపిక్ క‌మిటీ. కీల‌క ఆట‌గాడు అమిత్ రోహిదాస్ పై ఓ మ్యాచ్ నిషేదం విధించింది. దీంతో అత‌డు సెమీస్‌లో ఆడే వీలులేకుండా పోయింది. అత‌డు లేకుండా మంగ‌ళ‌వారం జ‌ర్మ‌నీతో జ‌ర‌గ‌నున్న సెమీస్‌లో భార‌త్ ఆడాల్సి ఉంది. ఇది భార‌త జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

దీనిపై భార‌త హాకీ స‌మాఖ్య స్పందించింది. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌తో ప్లేయ‌ర్ల‌లో ఆత్మ‌విశ్వాసం స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఉంద‌ని అంది. బ్రిట‌న్‌తో జ‌రిగిన మ్యాచులో రిఫ‌రీల నిర్ణ‌యాల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. రోహిదాస్ సస్పెన్షన్ పై మండిప‌డింది. ఈ నిర్ణ‌యాన్ని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌లో స‌వాల్ చేసింది. అయితే దీనిపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య విచారణ చేసి సోమవారం రోజున నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు షాకిచ్చిన టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌..

అస‌లేం జ‌రిగిందంటే..?

ఆదివారం బ్రిటన్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచులో అమిత్ దాస్‌కు అంఫైర్ రెండ్ కార్డు ఇచ్చాడు. మ్యాచ్‌ 17వ నిమిషంలో ఈ డిఫెండర్ రోహిదాస్ బంతితో పాటుగా వెళ్లే ప్రయత్నం చేయగా వెనకాల నుంచి వ‌చ్చిన బ్రిట‌న్ ఆట‌గాడు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ క్ర‌మంలో రోహిత్ దాస్ స్టిక్ పొర‌బాటున ప్ర‌త్య‌ర్థి ఆట‌గాడికి త‌గిలింది. వెంటనే రిఫరీ అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డు ఇచ్చాడు. దీంతో భార‌త్ 40 నిమిషాల పాటు 10 ఆటగాళ్లతోనే ఆడింది. ఈ క్ర‌మంలోనే అమిత్ దాస్‌పై ఓ మ్యాచ్ నిషేదం విధించారు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన టీమ్ఇండియా పారిస్‌లో స్వ‌ర్ణ ప‌త‌క‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లపై విజయం సాధించి సెమీస్‌కు దూసుకువ‌చ్చింది.

జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది.. కుమార్తెను హత్తుకొని కన్నీటి పర్యంతమైన టెన్నిస్ స్టార్.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు