Kavya Maran : కావ్యాపాప క‌న్నీళ్లు.. ఓదార్చిన అమితాబ్ బ‌చ్చ‌న్‌.. ‘ఇది ముగింపు కాదు..’

దాదాపు రెండు నెల‌ల పాటు క్రికెట్ అభిమానుల‌ను అల‌రించిన ఐపీఎల్ ముగిసింది.

Kavya Maran – Amitabh Bachchan : దాదాపు రెండు నెల‌ల పాటు క్రికెట్ అభిమానుల‌ను అల‌రించిన ఐపీఎల్ ముగిసింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను ఓడించి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజేత‌గా నిలిచింది. ఈ సీజ‌న్‌లో భారీ స్కోర్లు చేసిన హైద‌రాబాద్ ఫైన‌ల్ మ్యాచ్‌లో మాత్రం 113 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఈ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 11 ఓవ‌ర్ల లోపే అందుకుంది. త‌ద్వారా ముచ్చ‌ట‌గా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

కాగా.. ఎన్నో ఆశ‌ల‌తో ఫైన‌ల్‌లో అడుగుపెట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టు అభిమానుల‌తో పాటు ఆట‌గాళ్లు నిరాశ చెందారు. ముఖ్యంగా ఆ జ‌ట్టు య‌జ‌మాని కావ్యా మార‌న్ కంటిలో క‌న్నీళ్లు ఆగ‌లేదు. ఓ వైపు క‌న్నీళ్లు తుడుచుకుంటూ మ‌రో వైపు ఆట‌గాళ్ల‌ను చ‌ప్ప‌ట్ల‌తో అభినందించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచులు.. భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌ను ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

వ‌చ్చే సారి క‌ప్పును గెల‌వొచ్చున‌ని, మీరు అలా బాధ‌ప‌డుతుంటే చూడ‌లేక‌పోతున్నాం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. బిగ్‌బీ అమితాబ్ సైతం కావ్యాను ఓదార్చారు.

‘ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసింది. కేకేఆర్ ఎంతో సుల‌భంగా గెలిచింది. ఎస్ఆర్‌హెచ్ మంచి జ‌ట్టు. లీగ్‌లో చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అయితే ఫైన‌ల్‌లో నిరాశ‌ప‌రిచింది. ఇక్క‌డ బాధ‌క‌లిగించే విష‌యం ఏంటంటే? ఆ జ‌ట్టు య‌జ‌మానురాలు కావ్యా మార‌న్ స్టేడియంలోనే క‌న్నీళ్లు పెట్టుకుంది. కెమెరాల‌కు క‌న‌ప‌డ‌కుండా వెన‌క్కి తిరిగి క‌న్నీళ్లను తుడుచుకుంది. ఆమెను అలా చూడ‌డం బాధేసింది. ఇది ముగింపు కాదు.. మై డియ‌ర్‌.. అంద‌రికి రేపు అనేది ఒక‌టుంటుంది.’ అంటూ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.
T20 World Cup 2024 : న్యూయార్క్‌లో ల్యాండైన రోహిత్ సేన‌.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు